breaking news
Electronic bicycle
-
చూడటానికి ఇది సాదాసీదా సైకిల్ కానేకాదు..
చూడటానికి ఇది సాదాసీదా సైకిల్లాగానే కనిపించినా, నిజానికిది ఫాస్ట్ ఫోల్డింగ్ ఈ–బైక్. ఇప్పటికే కొన్ని ఫోల్డింగ్ ఈ–బైక్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిని మడతపెట్టడానికి రెండు మూడు నిమిషాల సమయం పడుతుంది.బ్రిటిష్ కంపెనీ ‘డికాథ్లాన్’ తాజాగా మార్కెట్లోకి ‘బీటీవిన్ ఈ–ఫోల్డ్–900’ పేరుతో తీసుకు వచ్చిన ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను కేవలం ఒక సెకండులోనే మడతపెట్టి కోరుకున్న చోటుకు తేలికగా తీసుకుపోవచ్చు. ఇది 252 డబ్ల్యూహెచ్ సామర్థ్యం గల రీచార్జ్ బ్యాటరీతో పనిచేస్తుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేశాక 55 కిలోమీటర్ల వరకు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది.బ్రష్‌లెస్ మోటారుతో తయారైన దీని గరిష్ఠ వేగం గంటకు 25 కిలోమీటర్లు. నగరాలు, పట్టణాల రహదారుల్లోనే కాకుండా ఎగుడు దిగుడు కొండ దారుల్లో కూడా సునాయాసంగా ప్రయాణించేలా దీనిని తీర్చిదిద్దడం విశేషం. ప్రస్తుతం దీనిని యూరోప్ మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చారు. దీని ధర 1499 పౌండ్లు (రూ.1.59 లక్షలు).ఇవి చదవండి: ఇది డబుల్ డెక్కర్ బస్సు.. అలాగే రెస్టారెంట్ కూడా! -
మడతడిపోద్ది...
ఫొటోలో కనిపిస్తున్న ఈ సైకిల్... ఈ-సైకిలే. మరేం లేదు... ఇది ఎలక్ట్రానిక్ సైకిల్. ‘సిట్ గో’ పేరిట రూపొందించిన ఈ సైకిల్‌ను నడపాలంటే, కాళ్లకు పనిచెప్పి తొక్కాల్సిన పనేమీ ఉండదు. రద్దీ రోడ్ల మీద ప్రయాణాలకు అనువుగా, ఇది చాలా తేలికగా ఉంటుంది. అంతేకాదు, దీనికి పార్కింగ్ బెడద కూడా లేదు. నిలిపి ఉంచాల్సి వస్తే, శుభ్రంగా మడిచేస్తే చాలు, మడతడిపోద్ది. ఇంట్లోకైనా, ఆఫీసులోకైనా... ఇంకెక్కడికైనా... మడిచేసిన సైకిలును ఇంచక్కా సూట్‌కేసులా మోసుకుపోవచ్చు. లిథియం బ్యాటరీతో పనిచేసే 180 వాట్ల బ్రష్‌లెస్ మోటారుతో నడిచే ఈ సైకిలు గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒకసారి బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేస్తే, ఏకధాటిగా 40 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇంట్లో వాడే 220 వోల్టుల ప్లగ్‌ల ద్వారా దీన్ని చార్జ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ సైకిల్‌కు ఇమిడి ఉన్న యూఎస్బీ పోర్ట్ ద్వారా స్మార్ట్ఫోన్లు వంటి వాటిని ప్రయాణ సమయంలో చార్జ్ చేసుకునే వెసులుబాటూ ఉంది. స్మార్ట్ వాహనాలను తయారు చేయాలనే ఉద్దేశంతో గత ఏడాది హాంకాంగ్‌లో బృందంగా ఏర్పడిన అంతర్జాతీయ డిజైనర్లు దీనికి రూపకల్పన చేశారు. మార్కెట్లో ఇది అందుబాటులోకి వచ్చే నాటికి దీని ధర 700 డాలర్ల వరకు (రూ.46 వేలు) ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు ఈ డిజైనర్లు చెబుతున్నారు.