విదేశాలకు వెళ్లేముందు... | Goes abroad ... | Sakshi
Sakshi News home page

విదేశాలకు వెళ్లేముందు...

Jul 17 2014 11:44 PM | Updated on Sep 2 2017 10:26 AM

విదేశాలకు వెళ్లేముందు...

విదేశాలకు వెళ్లేముందు...

ప్రయాణంలో తక్కువ మోతాదులో నగదు ఉంచుకోవాలి. ముఖ్యంగా కాఫీ తాగడానికి, స్థానిక ట్యాక్సీలలో తిరగడానికి, హోటల్స్‌లో /బయట టిప్స్ ఇవ్వడానికి సరిపడా నగదు దగ్గర ఉంచుకుంటే చాలు.

ఉపయుక్తం
 
ప్రయాణంలో తక్కువ మోతాదులో నగదు ఉంచుకోవాలి. ముఖ్యంగా కాఫీ తాగడానికి, స్థానిక ట్యాక్సీలలో తిరగడానికి, హోటల్స్‌లో /బయట టిప్స్ ఇవ్వడానికి సరిపడా నగదు దగ్గర ఉంచుకుంటే చాలు.
 
క్యాష్ పాస్‌పోర్ట్‌లో ఎక్కువ మోతా దులో బ్యాలెన్స్ ఉండేలా చూసుకో వాలి.
 
నగదు కన్నా డెబిట్‌కార్డ్/ క్రెడిట్‌కార్డ్ వెంట ఉంచుకో వడం ఉపయుక్తం.
    
 క్యాష్ పాస్‌పోర్ట్ అంటే...

 ప్రయాణంలో ఎక్కువ మొత్తంలో నగదు తీసుకెళ్తే పోయే ప్రమాదం ఉంది. అందుకోసం అందుబాటులోకి వచ్చినదే క్యాష్ పాస్‌పోర్ట్. దీనిని ప్రపంచంలో ఎక్కడైనా 24 గంటలూ ఉపయోగించుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా ఎంత మొత్తాన్నైనా నగదు బదిలీ చేసుకోవచ్చు. థామస్‌కుక్ వంటి ట్రావెల్ ఏజెన్సీల ద్వారా క్యాష్ పాస్‌పోర్ట్‌ను ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చు.  క్యాష్ పాస్‌పోర్ట్ పొందేవారి వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. మీ అప్లికేషన్ ఫామ్‌తో పాటు నివాస ధృవీకరణ పత్రం, ఫొటో ఐడీ కార్డ్, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లెసైన్స్, డెబిట్/క్రెడిట్ కార్డ్ ట్రాన్జాక్షన్స్ సమాచారం అవసరం.
 
అప్లికేషన్‌లో తెలిపిన వివరాలన్నీ సరైనవని నిర్ధారించుకున్నాక సంబంధిత ఏజెన్సీ 10 రోజుల అనంతరం మీకు కార్డ్ అందజేస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement