చందేరి పురాణ కట్టు | fashion designer vaishali shadangule new chanderi designs | Sakshi
Sakshi News home page

చందేరి పురాణ కట్టు

Sep 15 2016 10:56 PM | Updated on Sep 4 2017 1:37 PM

చందేరి పురాణ కట్టు

చందేరి పురాణ కట్టు

వేద కాలం నుంచి చందేరీ ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. సంప్రదాయం, సౌందర్యం కలబోసుకున్న చందేరీ చేనేతకు పుట్టినిల్లు మనదేశంలోని మధ్యప్రదేశ్.

ఇంపైన రంగుల కలబోత.. చిక్కని పోగుల కలనేత
పురాణ కాలాన పుట్టినా.. నేటి కాలాన తిరుగులేని చేనేత చందేరి.
చీర కట్టుతో సింగారించినా.. అనార్కలీ కట్‌తో అలరించినా
లెహంగా ఓణీలతో ఆకట్టుకున్న సంప్రదాయపు కళనేత చందేరి.

వేద కాలం నుంచి చందేరీ ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. సంప్రదాయం, సౌందర్యం కలబోసుకున్న చందేరీ చేనేతకు పుట్టినిల్లు మనదేశంలోని మధ్యప్రదేశ్. ఈ రాష్ట్రంలోని చందేరీ పట్టణానికి  ఇక్కడి హ్యాండ్లూమ్స్ వల్లే పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తమయ్యాయి. హ్యాండ్లూమ్ సిటీగా పిలిచే ఈ పట్టణంలో ఏ ఇంటి ముందు చూసినా రంగు రంగుల నూలు దారాల అల్లిక కనిపిస్తుంది. దేవతా వస్త్రాలుగా పేరొందిన ఈ ఫ్యాబ్రిక్ మొఘలుల కాలంలో రాచఠీవీతో వెలిగిపోయింది. పట్టు, కాటన్ ఫ్యాబ్రిక్‌లోనే కాదు రెండింటి మేలవింపుతోనూ చందేరీ ఆకట్టుకుంటుంది. అందుకే డిజైనర్లు చందేరీ ఫ్యాబ్రిక్‌తో ఎన్నో ప్రయోగాలు చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు. చందేరీ ఫ్యాబ్రిక్‌తో  చీరలు, షల్వార్ కమీజ్, అనార్కలీలు, కుర్తీలు.. ఇలా ఎన్నో రకాల డిజైనర్ వేర్ సృష్టిస్తున్నారు సృజనశీలులు.

 ఆరు గజాల కళాత్మకం
ప్రతి స్త్రీ అపురూపంగానూ.. ఎంతో ఇష్టంగా అందుకునే చీర చందేరీ. ఆరు గజాల చీర మీద ఆకట్టుకునే మోటిఫ్స్, చీర అంచులు, పల్లూ మీద కనిపించే మొఘలుల కళానైపుణ్యం మాటల్లో వర్ణించలేం. చందేరీ క్లాత్‌తో ప్రయోగాలు చేసి మీదైన స్టైల్‌తో ఒక ఎత్నిక్ స్టేట్‌మెంట్‌ను తెలియజేయవచ్చు. మొదట్లో ఎరుపు-నలుపు రంగులలోనే చందేరీ చీరలను రూపొందించేవారు. తరువాత ఫ్యాషన్ డిజైనర్ల జోక్యంతో ఈ క్లాత్‌పైన అద్భుతమైన డిజైన్లు వెలుగు చూశాయి.

 గ్లామర్ లుక్
దేశానికే కాదు ప్రపంచమంతటికీ చందేరీ చీరలు ఈ పట్టణం నుంచే ఎగుమతి అవుతాయి. అత్యంత తేలికగా ఉండటంతో పాటు సున్నితమైన లుక్‌తో ఆకట్టుకుంటుంది చందేరీ ఫ్యాబిక్. అంతేకాదు, దీనిపై ఆకట్టుకునే టెంపుల్ ఆర్ట్. మోటిఫ్స్‌లలో నెమళ్ళు, తామరపువ్వులు, నాణేలు, జియోమెట్రికల్ ప్యాటర్న్, ఇతర జంతు బొమ్మలు, ఊహాత్మక ఖగోళ గణాంకాలు.. ఇలా ఎన్నో చందేరీ మీద మనకు కనిపిస్తాయి. చందేరీ చీరలో ఒక గ్లామర్ లుక్ కనిపిస్తుంది.  అందుకే బాలీవుడ్ నటీమణులు, సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనే మహిళలు చందేరీని ఎక్కువగా ధరిస్తుంటారు. ఈ చీరల మీదకు బంగారు లేదా ముత్యాల ఆభరణాల సెట్ మరింత అందాన్ని ఇస్తుంది. కాటన్ శారీస్ అయితే వెండి ఆభరణాలు, మీనాకారి, టైట జువెల్లరీ ధరించవచ్చు.
తేలికగా ఉండే జరీ జిలుగులు, మృదువైన ఎంబ్రాయిడరీ సౌకర్యంగానూ, అందంగానూ ఉంచుతుంది. చందేరీ చీరకట్టు ఒక రాయల్ లుక్‌తో వెలిగిపోతుంది.

సంప్రదాయ కట్టు లెహంగా, చందేరీ దుపట్టా కాంబినేషన్‌తో ఫ్యాషన్ వేదిక మీద మోడల్స్‌చే ప్రదర్శించారు హైదరాబాద్ డిజైనర్ గౌరంగ్‌షా!

ముంబయ్ డిజైనర్ వైశాలీ షడంగులే చందేరీ ఫ్యాబ్రిక్‌తో ఇండోవెస్ట్రన్ డిజైన్స్‌ని సృష్టించారు. విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్‌లో వాటిని మోడల్స్‌చే ప్రదర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement