breaking news
Vedic period
-
వేదకాలం నుంచి నేటి కాలం వరకు...విదుషీమణులు
ప్రాచీన కాలంలో, అంటే క్రీ.పూ.3000 సంవత్సరాల ముందు కాలం నుండీ కూడా మన దేశం ‘స్త్రీ విద్య’ ను ప్రోత్సహించి, గౌరవించింది. ఆనాటి నుండీ స్త్రీలు లౌకిక, అలౌకిక విద్యలలో పురుషులతో సమానంగా నిలుస్తున్నారు. వేదకాలంలోనే మహిళలు ఉపనయన సంస్కారాలు పొంది, వేదాధ్యయనం చేశారు. వేద మంత్రాలు దర్శించారు. తపస్వినులు, ఆధ్యాత్మికవేత్తలైన స్త్రీలను ‘ఋషికలు’ అంటారు. రోమశ, గార్గి వాచక్నవి, విశ్వవర, ఆత్రేయి, లోపాముద్ర, ఇంద్రాణి, మైత్రేయి, అపాల, యామి, పౌలోమి, ఘోష, ఖోన, జుహు, వాగంభ్రణి, సావిత్రి, దేవజామి, కక్షివతి, దక్షిణ ప్రజాపత్య, విశ్వావతి, పశుక్రపత్ని, దేవసూని, శాశ్వతి, అంగీరసి, శ్రీ లక్ష్మి, నోధ, శిఖతన్వరి, గౌపాయన, ఉభయభారతి, విజ్జిక, కామాక్షి వంటి స్త్రీలందరూ ఋషికలే. గృహజీవనానికి స్త్రీయే పునాది అని ఋగ్వేదం చెప్పింది. శక్తిస్వరూపిణి అయిన స్త్రీని గౌరవించి, ఆరాధించే సంస్కృతి మనది. పరబ్రహ్మలోని స్త్రీ పరమైన గుణాలు, శక్తులు కలిసి ‘స్త్రీ దేవతలు’ అవతరించారు. వారి గురించి తెలుసుకుందాం. లోపాముద్ర: అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర సంస్కృత, తమిళ భాషలలో నిష్ణాతురాలు. లోపాముద్ర అంటే తనలో తానే లీనమైన ఆత్మనిష్ఠాపరురాలు అని అర్థం. అగస్త్యునికి, లోపాముద్రకు మధ్య జరిగిన సంవాదం, లోపాముద్ర పాండిత్యం, గెలుపును ఋగ్వేదం ప్రశంసించింది. అగస్త్యుడు, లోపాముద్ర సాహచర్యంలో సంవాదాలలో భౌతిక, ఆధ్యాత్మిక జీవితంలోని పవిత్రతను, పూర్ణత్వాన్ని గ్రహించాడని చెబుతారు.ఘోష: ఆమె దుర్గతమసుని మనుమరాలు. కక్షివంతుని కూతురు. దేవ వైద్యులైన అశ్వనీ కు మారులను స్తుతిస్తూ ఆ తండ్రీ కుమా రులు అనేక శ్లోకాలు రచించారు. పదవ ప్రకరణంలోని కొన్ని శ్లోకాలను తండ్రి, తాతగార్లతో సమానంగా ఘోష రచించింది. వాటిలోని ఒక శ్లోకంలో ఆమె అశ్వినులను వివాహం చేసుకోవాలనే ఆకాంక్షను వెల్లడిస్తుంది. కుష్ఠువ్యాధిచే కురూపి అయిన ఆమెను అశ్వనీ దే వతలు తమ వైద్యంతో ఆరోగ్యవంతు రాలిని, అందగత్తెను చేసి పెండ్లి చేసు కొంటారు.ఋగ్వేద మంత్ర ద్రష్ట మైత్రేయి: గొప్ప తాత్వికురాలు, ఋషిక అయిన మైత్రేయి కూడా ఋగ్వేద మంత్రాలను దర్శించింది. ఆమె తన భర్త అయిన యాజ్ఞవల్క్యుని వ్యక్తిత్వ, ఆధ్యాత్మిక ఆలోచనలను పరిణితి చెంచేలా చేయడంలో ప్రధానపాత్ర వహించింది. యాజ్ఞవల్క్యునికి కాత్యాయని అనే రెండవ భార్య కూడా ఉంది. ధర్మశాస్త్రాలు, వేదాలు బాగా చదివి, బ్రహ్మవాదినిగా మైత్రేయి ఘనత వహిస్తే, కాత్యాయని ఒక సాధారణ ఇల్లాలిగానే ఉండింది. ప్రాపంచిక చింతనలు విడిచి, సన్యాసికి అనువైన స్వీయ నియంత్రణ, సన్యాసి ప్రతిజ్ఞా పాలన చేయదలచి యాజ్ఞవల్క్యుడు ఒకరోజు తన ప్రాపంచిక ఆస్తిపాస్తులను తన ఇద్దరు భార్యలకు పంచదలిచాడు. ప్రపంచ సంపద తనకు శాశ్వతత్వాన్ని, ముక్తిని ఇవ్వలేదని భావించి మైత్రేయి తన భర్త నుండి కేవలం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ముముక్షత్వానికి కావలసిన శిక్షణను కోరుకొని మరీ పొందింది.బ్రహ్మజ్ఞాని గార్గి: వాచక్న మహర్షి కూతురు, వైదిక ప్రవక్త గార్గి. మానవ అస్తిత్వానికి, ఉనికికి, జీవితానికి మూలమేమిటి అనే అంశంపై గార్గి అనేక వేదమంత్రాలను దర్శించింది. ఎందరో వేదాంత వేత్తలను వాదంలో గెలిచిన యాజ్ఞవల్క్యునికి ఆత్మానాత్మల విచారం గురించి, బ్రహ్మ జ్ఞానం గురించి అనేక ప్రశ్నలను సంధించి గార్గి ఆయనను ముప్పుతిప్పలు పెట్టింది. గొప్ప విజ్ఞాని ఉభయభారతి: మధ్యయుగంలో తత్వవేత్త, మీమాంస, అద్వైత దర్శనాలలో ప్రవీణుడైన మండనమిశ్రుని భార్య అయిన ఉభయభారతి ఒక గొప్ప విజ్ఞాని. శ్రీ ఆదిశంకరాచార్యులకు, మండనమిశ్రునికి మధ్య జరిగిన అద్వైత సిద్ధాంత సంబంధిత వాదోపవాదాలకు ఆమె న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. పక్షపాత రహితంగా ఆ వాదనలలో తన భర్తను కాక, ఆదిశంకరులనే విజేతగా ప్రకటించిన విదుషీమణి ఆమె.ఆళ్వార్ ఆండాళ్: ఇంకా ఆ యుగంలో ‘తిరు΄్పావై ’ అనే భక్తి గీతాలను వ్రాసిన మొదటి మహిళా ఆళ్వార్ అండాళ్. స్త్రీ స్వేచ్ఛ, వ్యక్తిత్వంపై కవితలు వ్రాసిన కర్నాటకలోని శివ భక్తురాలు అక్క మహాదేవి. రాజస్థాన్ లోని కృష్ణ భక్తురాలు, సాంఘిక దురాచారాలను ప్రతిఘటించిన కవయిత్రి మీరాబాయి, సరళ భాషలో వేదాంతపరమైన నిగూఢార్థాలు చాటిచెప్పిన తత్వవేత్త లాలాదేవి, గ్రామీణుల సాధారణ జ్ఞానాన్ని వేదాంత విజ్ఞానంతో అనుసంధిస్తూ రచనలు చేసిన తమిళ కవయిత్రి అవ్వయ్యార్, ఇంకా సక్కుబాయి, ముక్తాబాయి, మదాలస, ఈ మధ్యకాలంలో తరిగొండ వెంగమాంబ, ఆదోని లక్షమ్మ, జిల్లెళ్ళమూడి అనసూయమ్మ మొదలైన యోగినులు, అంతర్బుద్ధి సిద్ధులైన మహిళలు ఎందరో ఉన్నారు.విజ్జిక: దండి మహాకవి తన ఒక రచనలో సరస్వతీ దేవిని తెలుపు దేహరంగు చ్ఛాయ కలదిగా వర్ణించాడు. విజయాంబిక (విజ్జిక) అనే కవయిత్రి నలుపురంగుతో ఉండేది. ఆమె దండి అభిప్రాయాన్ని ప్రతిఘటించింది. నల్లని దేహకాంతిగల అపర సరస్వతినైన నా గురించి తెలుసుకోకుండా సరస్వతి ధవళవర్ణిని అని దండికవి ఎలా అంటాడని ఆమె ప్రశ్నించింది. స్త్రీల ఆత్మవిశ్వాసానికి విజ్జిక ఒక ప్రతీక. ఇంకా గంగాదేవి, తాళ్ళపాక తిమ్మక్క, మొల్ల వంటి కవయిత్రులు రసవత్తర కావ్యాలు వెలువరించి పురుషులతో సమానంగా నిలిచినవారే.ఆధ్యాత్మిక వేత్త గౌతమి: బౌద్ధయుగంలో గౌతమ బుద్ధుని పెంపుడు తల్లి అయిన మహా ప్రజావతి గౌతమి ఒక ఆధ్యాత్మికవేత్త. ఆమె కాక బౌద్ధ వేదాంత ధ్యాన సన్యాసినులు ఖేమ, ఉప్పలావన, రెండవ భాస్కరుని కూతురైన లీలావతి వంటి ఆధ్యాత్మిక వేత్తలైన స్త్రీలుండేవారు. – డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
చందేరి పురాణ కట్టు
ఇంపైన రంగుల కలబోత.. చిక్కని పోగుల కలనేత పురాణ కాలాన పుట్టినా.. నేటి కాలాన తిరుగులేని చేనేత చందేరి. చీర కట్టుతో సింగారించినా.. అనార్కలీ కట్‌తో అలరించినా లెహంగా ఓణీలతో ఆకట్టుకున్న సంప్రదాయపు కళనేత చందేరి. వేద కాలం నుంచి చందేరీ ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. సంప్రదాయం, సౌందర్యం కలబోసుకున్న చందేరీ చేనేతకు పుట్టినిల్లు మనదేశంలోని మధ్యప్రదేశ్. ఈ రాష్ట్రంలోని చందేరీ పట్టణానికి ఇక్కడి హ్యాండ్లూమ్స్ వల్లే పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తమయ్యాయి. హ్యాండ్లూమ్ సిటీగా పిలిచే ఈ పట్టణంలో ఏ ఇంటి ముందు చూసినా రంగు రంగుల నూలు దారాల అల్లిక కనిపిస్తుంది. దేవతా వస్త్రాలుగా పేరొందిన ఈ ఫ్యాబ్రిక్ మొఘలుల కాలంలో రాచఠీవీతో వెలిగిపోయింది. పట్టు, కాటన్ ఫ్యాబ్రిక్‌లోనే కాదు రెండింటి మేలవింపుతోనూ చందేరీ ఆకట్టుకుంటుంది. అందుకే డిజైనర్లు చందేరీ ఫ్యాబ్రిక్‌తో ఎన్నో ప్రయోగాలు చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు. చందేరీ ఫ్యాబ్రిక్‌తో చీరలు, షల్వార్ కమీజ్, అనార్కలీలు, కుర్తీలు.. ఇలా ఎన్నో రకాల డిజైనర్ వేర్ సృష్టిస్తున్నారు సృజనశీలులు. ఆరు గజాల కళాత్మకం ప్రతి స్త్రీ అపురూపంగానూ.. ఎంతో ఇష్టంగా అందుకునే చీర చందేరీ. ఆరు గజాల చీర మీద ఆకట్టుకునే మోటిఫ్స్, చీర అంచులు, పల్లూ మీద కనిపించే మొఘలుల కళానైపుణ్యం మాటల్లో వర్ణించలేం. చందేరీ క్లాత్‌తో ప్రయోగాలు చేసి మీదైన స్టైల్‌తో ఒక ఎత్నిక్ స్టేట్మెంట్ను తెలియజేయవచ్చు. మొదట్లో ఎరుపు-నలుపు రంగులలోనే చందేరీ చీరలను రూపొందించేవారు. తరువాత ఫ్యాషన్ డిజైనర్ల జోక్యంతో ఈ క్లాత్‌పైన అద్భుతమైన డిజైన్లు వెలుగు చూశాయి. గ్లామర్ లుక్ దేశానికే కాదు ప్రపంచమంతటికీ చందేరీ చీరలు ఈ పట్టణం నుంచే ఎగుమతి అవుతాయి. అత్యంత తేలికగా ఉండటంతో పాటు సున్నితమైన లుక్‌తో ఆకట్టుకుంటుంది చందేరీ ఫ్యాబిక్. అంతేకాదు, దీనిపై ఆకట్టుకునే టెంపుల్ ఆర్ట్. మోటిఫ్స్లలో నెమళ్ళు, తామరపువ్వులు, నాణేలు, జియోమెట్రికల్ ప్యాటర్న్, ఇతర జంతు బొమ్మలు, ఊహాత్మక ఖగోళ గణాంకాలు.. ఇలా ఎన్నో చందేరీ మీద మనకు కనిపిస్తాయి. చందేరీ చీరలో ఒక గ్లామర్ లుక్ కనిపిస్తుంది. అందుకే బాలీవుడ్ నటీమణులు, సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనే మహిళలు చందేరీని ఎక్కువగా ధరిస్తుంటారు. ఈ చీరల మీదకు బంగారు లేదా ముత్యాల ఆభరణాల సెట్ మరింత అందాన్ని ఇస్తుంది. కాటన్ శారీస్ అయితే వెండి ఆభరణాలు, మీనాకారి, టైట జువెల్లరీ ధరించవచ్చు. తేలికగా ఉండే జరీ జిలుగులు, మృదువైన ఎంబ్రాయిడరీ సౌకర్యంగానూ, అందంగానూ ఉంచుతుంది. చందేరీ చీరకట్టు ఒక రాయల్ లుక్‌తో వెలిగిపోతుంది. సంప్రదాయ కట్టు లెహంగా, చందేరీ దుపట్టా కాంబినేషన్‌తో ఫ్యాషన్ వేదిక మీద మోడల్స్‌చే ప్రదర్శించారు హైదరాబాద్ డిజైనర్ గౌరంగ్‌షా! ముంబయ్ డిజైనర్ వైశాలీ షడంగులే చందేరీ ఫ్యాబ్రిక్‌తో ఇండోవెస్ట్రన్ డిజైన్స్‌ని సృష్టించారు. విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్‌లో వాటిని మోడల్స్‌చే ప్రదర్శించారు.


