కళ్లజోడు మచ్చలకు కలబంద... | Eyewear spotted aloe to ... | Sakshi
Sakshi News home page

కళ్లజోడు మచ్చలకు కలబంద...

Apr 14 2016 11:20 PM | Updated on Sep 3 2017 9:55 PM

కళ్లజోడు మచ్చలకు కలబంద...

కళ్లజోడు మచ్చలకు కలబంద...

కళ్లజోడు పెట్టుకున్నవారికి ముక్కుకు ఇరువైపులా ముదురు గోధుమరంగులో, ఇంకొందరికి నల్లగా మచ్చలు ఏర్పడుతుంటాయి.

బ్యూటిప్స్

 

కళ్లజోడు పెట్టుకున్నవారికి ముక్కుకు ఇరువైపులా ముదురు గోధుమరంగులో, ఇంకొందరికి నల్లగా మచ్చలు ఏర్పడుతుంటాయి. ఈ మచ్చలు పోయి, చర్మం పూర్వపు రంగులోకి రావాలంటే...కలబంద జెల్‌ను మచ్చలు ఏర్పడిన చోట రాసి, 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే మచ్చలు తగ్గుతాయి.మచ్చలపై తేనె రాసి, 10-15 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.రెండు స్పూన్ల నిమ్మరసంలో స్పూన్ నీళ్లు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో దూది ఉండను ముంచి, మచ్చలపై రాయాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. రోజూ ఈ విధంగా చేయడం వల్ల కళ్లజోడు వల్ల అయిన మచ్చలను తగ్గించుకోవచ్చు.

     

బంగాళదుంప రసాన్ని మచ్చలున్న చోట రాయాలి. లేదంటే, బంగాళదుంప ముక్కతో మచ్చలున్న చోట మృదువుగా రుద్దాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే మచ్చలు తగ్గుతాయి. నారింజతొక్కలను ఎండబెట్టి, పొడి చేయాలి. దీంట్లో కొద్దిగా పాలు పోసి, పేస్ట్‌లా కలపాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలున్న చోట రాసి, 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. రోజూ ఈ విధంగా చేయాలి.అవకాడో పండును గుజ్జు చేయాలి. ఈ గుజ్జును మచ్చలున్నచోట మాత్రమే కాదు, ముఖమంతా రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవచ్చు. అవకాడోలో ఉన్న సహజ ఔషధ గుణాలు చర్మం పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది.రోజ్‌వాటర్‌లో దూది ఉండను ముంచి, మచ్చలున్న చోట రాయాలి. అలాగే శనగపిండిలో కొన్ని చుక్కల రోజ్‌వాటర్ పోసి, పేస్ట్ చేసి రాయాలి. ఈ విధంగా రోజూ చేస్తూ ఉంటే మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.   {స్టాబెర్రీలో విటమిన్ ‘సి’ సమృద్ధిగా ఉంటుంది. స్ట్రాబెర్రీ గుజ్జును మచ్చల మీద రాసి, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement