
చిన్నారులకు ఆ మందులు ఇవ్వద్దు
చిన్నారులకు కొద్దిపాటి జ్వరం వస్తే ఆదుర్దాపడిపోయి, వారికి పారాసెటిమాల్
మూడు ముచ్చట్లు
చిన్నారులకు కొద్దిపాటి జ్వరం వస్తే ఆదుర్దాపడిపోయి, వారికి పారాసెటిమాల్, ఇబూప్రొఫెన్ వంటి మందులు ఇవ్వొద్దని అమెరికన్ వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు కాస్త ఒళ్లు వెచ్చబడగానే తల్లిదండ్రులు కంగారుగా ఆ మందులు వేస్తారని, దీనివల్ల పిల్లలకు మేలు జరగకపోగా, కొన్నిసార్లు అనర్థాలకు దారితీయవచ్చని చెబుతున్నారు.
చాలాసార్లు వైద్యులు సైతం జ్వరం వచ్చిన వెంటనే పిల్లలకు ఈ మందులు వాడాలని అనాలోచితంగా సూచిస్తుంటారని, ఇది సరైన పద్ధతి కాదని అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఎక్సలెన్స్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏవైనా ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు వాటితో శరీరం జరిపే పోరాటం జ్వరంగా బయటపడుతుందని, జ్వరం వచ్చిన వెనువెంటనే మందులు వేస్తే రోగ నిరోధక శక్తి బలహీనపడుతుందని వారు వివరిస్తున్నారు.