జూలై 3న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | Celebrities celebrated a birthday on July 3 | Sakshi
Sakshi News home page

జూలై 3న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Jul 2 2015 11:34 PM | Updated on Sep 3 2017 4:45 AM

జూలై  3న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

జూలై 3న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9.

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు:
టామ్ క్రూజ్ (నటుడు); హర్భజన్‌సింగ్ (క్రికెటర్)

 
ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. చిరకాలంగా ఆస్తి కొనాలనుకుంటున్న వారి కోరిక ఈ సంవత్సరం తప్పక తీరుతుంది. కళాకారులకు అభివృద్ధికరంగా, ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్మానాలు, సత్కారాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. గత సంవత్సరం ప్రారంభించిన వ్యాపారాలు లాభాల బాటలో పడతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. రాజకీయ నాయకులకు పదవులు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆధునిక వాహనాలు కొంటారు. అయితే వాటిని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే మీ పుట్టిన తేదీ 3 కావడం వల్ల మీపై కుజగ్రహ ప్రభావం ఉంటుంది. దీనివల్ల కొద్దిపాటి అనారోగ్య సమస్యలు, వాహన ప్రమాదాలు, పదునైనా ఆయుధాల వల్ల రక్తస్రావం వంటివి తలెత్తవచ్చు. దూకుడుగా,  వ్యవహరించడం వల్ల వివాదాలు తలెత్తవచ్చు.

 లక్కీ డేస్: 1,4,6,9; లక్కీ కలర్స్: వయొలెట్, రోజ్, ఆరంజ్, రెడ్; లక్కీ డేస్: ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు; సూచనలు: మాట లలోనూ, చేతలలోనూ సంయమనం పాటించాలి. దక్షిణామూర్తిని పూజించాలి. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేయించాలి. రక్తదానం చేయడం, చేయించడం, అనాథలకు బెల్లం పాయసం వితరణ చేయడం, ప్రసిద్ధమైన దర్గా లు లేదా చర్చిలను సందర్శించడం,  మతగ్రంథాలను పఠించడం మంచిది.
 - డా. మహమ్మద్ దావూద్  జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement