పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | Birthday celebrated Celebrities | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Aug 5 2015 10:34 PM | Updated on Sep 3 2017 6:50 AM

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4...

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: అవినాష్ దీక్షిత్ (ఆర్థికవేత్త), ఆదిత్య నారాయణ్ (బాలీవుడ్ సింగర్)  
 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. ఇది రాహువుకు సంబంధించినది కావడం వల్ల ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగులకు ప్రమోషన్లు ఉంటాయి. సొంత ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు చేయాలన్న కోరిక నెరవేరుతుంది. ఎన్నో ఏళ్లుగా కోర్టులో ఆస్తికి సంబంధించి నలుగుతున్న వివాదాలు మీకు అనుకూలంగా పరిణమిస్తాయి. మీరు పుట్టిన తేదీ 6. ఇది శుక్రునికి సంబంధించినది కావడం వల్ల పుట్టుకతోనే సౌకర్యాలు, డబ్బు, సంతోషం, విలాసవంతమైన జీవనం అలవడతాయి. ఎల్లప్పుడూ అందంగా, యవ్వనంగా కనిపిస్తారు. ఏ ఆటంకాలూ లేకుండా జీవితం సాఫీగా సాగుతుంది. అందరికీ ఇష్టులుగా మారతారు. ఈ సంవత్సర సంఖ్య 4 కావడం వల్ల అదనపు బరువు బాధ్యతలు మీదపడి, మీరే నెరవ్చేవలసి వస్తుంది.

దీనివల్ల ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవడం అవసరం. అలాగే కొత్తగా కోర్టు వివాదాలలో తలదూర్చకుండా, వివాదాల జోలికి పోకుండా సామరస్యంగా వ్యవహరించడం మంచిది. ఈ సంవత్సరం విజయాలను తీసుకు వచ్చినా, శ్రమ తప్పదు. లక్కీ నంబర్స్: 2,4,6; లక్కీ డేస్: బ్లూ, వైట్, వయొలెట్, గోల్డెన్, శాండల్; లక్కీడేస్: సోమ, గురు, శుక్రవారాలు; జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, అక్టోబర్, నవంబర్. సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుదర్శన హోమం చేయించడం, అనాథలకు అన్నదానం చేయించడం మంచిది.                                
- డాక్టర్ మహమ్మద్ దావూద్

Advertisement
 
Advertisement
Advertisement