బ్యూటిప్స్‌ | beauty tips | Sakshi
Sakshi News home page

బ్యూటిప్స్‌

Dec 15 2016 10:46 PM | Updated on Sep 22 2017 9:10 PM

బ్యూటిప్స్‌

బ్యూటిప్స్‌

సోంపు ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో తలస్నానం చేస్తే కేశాలు బాగా పెరుగుతాయి,

► సోంపు ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో తలస్నానం చేస్తే కేశాలు బాగా పెరుగుతాయి, మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. రెండు లీటర్ల నీటిలో రెండు గుప్పెళ్ల సోంఫు ఆకులను వేసి మరిగించి దించాక కొంచెం సేపు కదిలించకుండా అలాగే ఉంచాలి. నీరు ఆకులలోని సుగుణాలను ఇముడ్చుకుంటుంది. ఈ నీటిలో ఒక టేబుల్‌ స్పూన్‌ వెనిగర్‌ను కలిపి తలస్నానం పూర్తయ్యాక జుట్టుకంతటికీ పట్టేటట్లు పోయాలి.

►చర్మం మీద నల్లటి మచ్చలుంటే బీర ఆకులను మెత్తగా పేస్టు చేసి అప్లయ్‌ చేయాలి. రోజుకు నాలుగైదు సార్లు చేస్తుంటే వారం రోజుల్లో మచ్చలు మాయమవుతాయి.

► చెమట వాసన శరీరం నుంచి దుర్గంధం వస్తుంటే బిల్వ ఆకులను మెత్తగా నూరి ఒంటికి పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే దుర్వాసన సమస్య తగ్గుతుంది.

► లెట్యూస్‌ ఆకులను(క్యాబేజీ లాగా ఉంటుంది, ఆకులు మరింత పలుచగా ఉంటాయి) గ్రైండ్‌ చేసి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి పదిహేను నిమిషాల తర్వాత నీటితో కడగాలి. ఇది అదనపు జిడ్డును తొలగించి చర్మాన్ని తాజాగా ఉంచడంలో చక్కగా పని చేస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement