విజయశాంతి, వీహెచ్ లకు అసెంబ్లీ టిక్కెట్లు | vijayashanthi contest from medak assembly | Sakshi
Sakshi News home page

విజయశాంతి, వీహెచ్ లకు అసెంబ్లీ టిక్కెట్లు

Apr 7 2014 9:06 PM | Updated on Oct 16 2018 3:09 PM

విజయశాంతి, వీహెచ్ లకు అసెంబ్లీ టిక్కెట్లు - Sakshi

విజయశాంతి, వీహెచ్ లకు అసెంబ్లీ టిక్కెట్లు

తెలంగాణలో శాసనసభ స్థానాలకు ఖరారైన అభ్యర్థుల్లో ఇద్దరు ఎంపీలున్నారు.

న్యూఢిల్లీ: తెలంగాణలో శాసనసభ స్థానాలకు ఖరారైన అభ్యర్థుల్లో ఇద్దరు ఎంపీలున్నారు. విజయశాంతి, వి. హన్మంతరావులకు అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చారు. విజయశాంతికి మెదక్, హన్మంతరావుకు అంబర్పేట స్థానాలు కేటాయించారు. ముగ్గురు ఎమ్మెల్సీలు డి. శ్రీనివాస్, షబ్బీర్ అలీ, నంది ఎల్లయ్య శాసనసభ సమరంలో నిలిచారు.

యూత్‌ కాంగ్రెస్ కోటాలో ముగ్గురికి టికెట్లు దక్కాయి. ఆదిలాబాద్‌ నుంచి భార్గవ్‌దేశ్ పాండే, కల్వకుర్తి నుంచి వంశీచంద్‌రెడ్డి, భువనగిరి నుంచి పి.వెంకటేశ్వర్లు పేర్లు ఖరారు చేశారు. 111 మంది అభ్యర్థులతో తెలంగాణలో కాంగ్రెస్ ఖరారు చేసిన జాబితాలో  బీసీలకు 33, మైనార్టీలకు 4, ఎస్సీలకు19, ఎస్టీలకు 9 సీట్లు కేటాయించారు.

Advertisement
 
Advertisement
Advertisement