రంగాను పొట్టన పెట్టుకున్న టీడీపీ

రంగాను పొట్టన పెట్టుకున్న టీడీపీ - Sakshi


* టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకు దారుణ హత్య

* పేదలకు కాపు కాసిన నేతను కాటేశారు


 

 వంగవీటి మోహనరంగా.. జనం సమస్యలను ముందుండి పరిష్కరించిన నేత. 1981లో జైలులో ఉండగానే కార్పొరేటర్‌గా గెలుపొందారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ ప్రభుత్వం తీసుకున్న పక్షపాత నిర్ణయాల్ని నిలదీశారు. ఆ పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. రిక్షా కార్మికుడు నర్సింహారావు లాకప్‌డెత్ నేపథ్యంలో రంగా నేతృత్వంలో వీధుల్లోకి వచ్చిన కార్మికుల  ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎగ్జిబిషన్ మైదానంలో పోలీస్ పరేడ్‌కు హాజరైన అప్పటి హోం మంత్రి కోడెల శివప్రసాదరావును కలిసి నిరసన తెలిపేందుకు వందలాది రిక్షాలతో కార్మికుల్ని వెంటబెట్టుకుని వెళ్లి రంగా ైధె ర్యంగా చేసిన పోరాట ం చూసినవారెవ్వరూ మరచిపోరు.

 

 ఆయన తీరు చూసిన వారంతా ‘పేదలకు కాపు కాసిన నిజమైన నేత రంగా..’ అని అప్పట్లో అనుకునేవారు. ఇదే సమయంలో 1985లో జరిగిన ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో టీడీపీ నేతలకు.. ముఖ్యంగా చంద్రబాబునాయుడు లాంటి వాళ్లకు ఏమాత్రం మింగుడుపడలేదు. టీడీపీ ప్రజాకంటక నిర్ణయాల్ని రంగా ఎండగట్టడంతో టీడీపీ నేతలు ఆయనను హత్య వంటి కేసుల్లో కూడా ఇరికించి జైలులో పెట్టి జనంలో లేకుండా చేశారు. 1988లో విజయవాడలో ఐదు లక్షల మందితో భారీగా కాపునాడు జరిగింది. కొద్దిరోజులకు బెయిల్‌పై విడుదలైన రంగా కోస్తా ప్రాంతంలో జనచైతన్య యాత్ర ప్రారంభించడంతో టీడీపీ అగ్రనేతలకు సైతం ముచె ్చమటలు పట్టాయి.

 

 రంగా ఎదుగుదల చూసిన చంద్రబాబునాయుడు, కోడెల శివప్రసాదరావు, దేవినేని నెహ్రూ వంటి నేతలకు వెన్నులో వణుకుపుట్టింది. రంగా ఉంటే రాజకీయంగా కష్టాలు తప్పవనే నిర్ణయానికి వారంతా వచ్చారు. రంగాకు బెదిరింపులు నిత్యకృత్యమయ్యాయి. ఉన్నత స్థాయి వారితో పాటు టీడీపీ పాలకుల నుంచి కూడా హతమారుస్తామన్న హెచ్చరికలకు భయపడి రంగా రాజీ బాట పట్టలేదు. టీడీపీ నేతలు పోలీసుల్ని ఉసిగొల్పడంతో తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని టీడీపీ పాలకుల్ని కోరారు. ప్రాణాల్ని బలితీసుకుంటారన్న నిర్ణయానికి వచ్చిన రంగా గాంధేయమార్గంలో బందరు రోడ్డులోని రాఘవయ్యపార్కు వద్ద తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. దీక్షలో ఉండగానే 1988 డిసెంబర్ 26 తెల్లవారుజామున అయ్యప్ప భక్తుల వేషాల్లో వచ్చిన తెలుగుతమ్ముళ్లు కత్తులతో అతి కిరాతకంగా రంగాను పొట్టనబెట్టుకున్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top