రాజధానిలో తెలుగు తమ్ముళ్ల తిరుగుబాటు | TDP leaders revolt against chandrababu in Hyderabad | Sakshi
Sakshi News home page

రాజధానిలో తెలుగు తమ్ముళ్ల తిరుగుబాటు

Apr 9 2014 3:12 PM | Updated on Sep 4 2018 5:07 PM

ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు లంకల దీపక్ రెడ్డి రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి. టీడీపీ నేత సామరంగారెడ్డి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు.

హైదరాబాద్: రాజధానిలో తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. కొందరు పార్టీ వీడే యోచనలో ఉండగా, మరికొందరు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు లంకల దీపక్ రెడ్డి రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి. టీడీపీ నేత సామరంగారెడ్డి  స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు.

 మరో నలుగురు టీడీపీ టీడీపీ కార్పొరేటర్లు పార్టీకి రాజీ నామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. కొందరు నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీ తరపున రంగంలోకి దిగారు. ఎల్బీనగర్‌లో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన బీసీ నాయకుడు ఆర్‌.కృష్ణయ్యపై రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడిలో కృష్ణయ్య వాహనం ధ్వంసమైంది. దీంతో పరిస్థతి ఉద్రిక్తంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement