పంచ్ :మోడీ.. బొమ్మరిల్లు డాడీ | Punch: Bommarillu Daddy Narendra modi | Sakshi
Sakshi News home page

పంచ్ :మోడీ.. బొమ్మరిల్లు డాడీ

Apr 8 2014 2:07 AM | Updated on Aug 15 2018 2:14 PM

పంచ్ :మోడీ.. బొమ్మరిల్లు డాడీ - Sakshi

పంచ్ :మోడీ.. బొమ్మరిల్లు డాడీ

నేనేమో ‘కారు’లో వెళ్లాలనుకుంటాను. మీరు ‘సైకిల్’ తొక్కమంటారు. మొత్తం మీరే చేశారు. మొత్తం మీరే చేశారు.. చాలు.. ఇప్పటిదాకా మీరు నాకు చేసింది చాలు.

నేనేమో ‘కారు’లో వెళ్లాలనుకుంటాను. మీరు ‘సైకిల్’ తొక్కమంటారు.  మొత్తం మీరే చేశారు. మొత్తం మీరే చేశారు..
 చాలు.. ఇప్పటిదాకా మీరు నాకు చేసింది చాలు. మీ వల్ల నేను కోల్పోయింది చాలు. ఇంకా అర్థం కాలేదా మీకు..
 నేనేమో ‘కారు’లో వెళ్లాలనుకుంటాను. మీరు ‘సైకిల్’ తొక్కమంటారు.  అవును 1000 సార్లు  అదే  బావుందనే ఆలోచిస్తారు.
 కానీ.. ఒక్కసారన్నా వీడికి ఏది నచ్చుతుంది..? అని ఆలోచించారా?  అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడంలో ఉన్న సంతోషం మీకు తెలుసు. కానీ కోరుకున్నది దొరక్కపోతే ఉండే బాధ మీకు తెలియదు. నాకు తెలుసు!
 పనికిరాని సైకిల్ మీద వెళ్తుంటే.. అందరూ నవ్వుతున్నారు మోడీ. మీరే పొత్తు కుదురుస్తారు. మీరే బావుంది అంటారు..అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే ఒప్పిస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా..? నాకు నచ్చలేదు.. సైకిల్ తొక్కను.. బాబుతో వెళ్లను.. అని గట్టిగా అరవాలనిపిస్తోంది. మీ భవిష్యత్ కోసం తొమ్మిదేళ్ల నుంచి మేం ఓడిపోతూనే ఉన్నాం మోడీ.
- ప్రవీణ్‌కుమార్ కాసం

Advertisement
 
Advertisement
Advertisement