వైఎస్‌ఆర్ సీపీతోనే పేదల అభ్యున్నతి | poor progression with ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్ సీపీతోనే పేదల అభ్యున్నతి

Mar 28 2014 3:09 AM | Updated on May 25 2018 9:12 PM

వైఎస్సార్ సీపీతోనే పేదల అభ్యున్నతి సాధ్యమని అనంతపురం ఎంపీ అనంతవెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.

 పెద్దవడుగూరు, న్యూస్‌లైన్:   వైఎస్సార్ సీపీతోనే పేదల అభ్యున్నతి సాధ్యమని అనంతపురం ఎంపీ అనంతవెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.  తాడిపత్రి  మునిసిపాలిటీ మాజీ చైర్మన్ పేరం నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గూడూరు సూర్యనారాయణరెడ్డి, కన్వీనర్ ఎద్దుల శరభారెడ్డి తదితరులతో కలసి ఆయన గురువారం  క్రిష్టిపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలతోపాటు, జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రవేశపెట్టనున్న అమ్మఒడి, డ్వాక్రా రుణాల మాఫీ తదితర పథకాలను వివరించారు.

 

వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేస్తున్న జెడ్పీటీసీ అభ్యర్థి మేడిమాకుపల్లి చితంబరరెడ్డి, ఇతర ఎంపీటీసీ సభ్యులను గెలిపించాలని కోరారు. సింగిల్‌విండో అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, భాస్కర్‌రెడి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా 400 మంది పార్టీలో చేరారు. మండల నాయకులు కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. సమస్యలు పరిష్కారం కావాలంటే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, ఆయనను గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని పార్టీలో చేరిన వారు తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement