పొన్నం ప్రభాకర్కు మున్సిపోల్స్లో ఎదురుదెబ్బ | ponnam prabhakar faces bitter experience in municipal polls | Sakshi
Sakshi News home page

పొన్నం ప్రభాకర్కు మున్సిపోల్స్లో ఎదురుదెబ్బ

May 12 2014 4:21 PM | Updated on Aug 14 2018 4:24 PM

పొన్నం ప్రభాకర్కు మున్సిపోల్స్లో ఎదురుదెబ్బ - Sakshi

పొన్నం ప్రభాకర్కు మున్సిపోల్స్లో ఎదురుదెబ్బ

కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న మునిసిపాలిటీలన్నింటితో పాటు కరీంనగర్ కార్పొరేషన్ను కూడా టీఆర్ఎస్ గెలుచుకుంది.

కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న మునిసిపాలిటీలన్నింటితో పాటు కరీంనగర్ కార్పొరేషన్ను కూడా తెలంగాణ రాష్ట్ర సమితి గెలుచుకుంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో పొన్నం ప్రభాకర్ పక్షపాత ధోరణితో వ్యవహరించమే ఈ ఓటమికి కారణమని కాంగ్రెస్ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. మిగిలిన తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానంలోనే నిలిచినా, కేవలం కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మాత్రమే ఇంత దారుణమైన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement