‘గూడెం’లో కొత్త గాలి | political war to be started from kothagudem assembly constituency | Sakshi
Sakshi News home page

‘గూడెం’లో కొత్త గాలి

Apr 17 2014 1:18 AM | Updated on Aug 14 2018 4:46 PM

‘గూడెం’లో కొత్త గాలి - Sakshi

‘గూడెం’లో కొత్త గాలి

తొలిసారి తెలంగాణ రాష్ట్ర డిమాండ్ వినిపించిన గడ్డ. రజాకార్ల వ్యతిరేక ఉద్యమంలో పిడికిలి బిగించిన నేల. 1969లో ఇద్దర్ని బలిదానమిచ్చి తెలంగాణ స్ఫూర్తికి వేదికగా నిలిచిన భూమి.

తొలిసారి తెలంగాణ రాష్ట్ర డిమాండ్ వినిపించిన గడ్డ. రజాకార్ల వ్యతిరేక ఉద్యమంలో పిడికిలి బిగించిన నేల. 1969లో ఇద్దర్ని బలిదానమిచ్చి తెలంగాణ స్ఫూర్తికి వేదికగా నిలిచిన భూమి. అదే సింగరేణి సిరుల కేంద్రబిందువు కొత్తగూడెం నియోజకవర్గం. తెలంగాణవాదాన్ని బలంగా వినిపించే కొత్తగూడెం అసెంబ్లీ స్థానానికి ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రంలో వీచే గాలికి అనుకూలంగానే ఇక్కడి ఓటర్లు తీర్పులు చెప్పడం అనవారుుతీ. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత సీపీఐ తరఫున కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా ఉన్నారు.  
 
 కోలకాని నవీన్‌కుమార్, కొత్తగూడెం: డీసీసీ అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేసి వనమా వెంకటేశ్వరరావు  వైఎస్సార్ సీపీలో చేరడంతో నియోజకవర్గంలో కాంగ్రెస్  పార్టీ దాదాపు ఖాళీ అరుుంది. వనవూ వైఎస్సార్ సీపీ తరఫున బరిలో ఉన్నారు. మాజీ సీఎం జలగం వెంగళరావు తనయుడు జలగం వెంకటరావుటీఆర్‌ఎస్ నుంచి, వుూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వూజీ వుంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడు కోనేరు సత్యనారాయణ టీడీపీ నుంచి, సిట్టింగ్ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీపీఐ నుంచి  పోటీలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్, సీపీఐల మధ్య పొత్తు ఉంది. కాంగ్రెస్ ఓట్లు పూర్తిగా తమకు బదిలీ అవుతాయన్న విశ్వాసం లేదని సీపీఐ నాయకులు అంటున్నారు. జలగం బలగం పనిచేస్తుందా..?

అసెంబ్లీ నియోజకవర్గం
కొత్తగూడెం:  ఎవరెన్నిసార్లు గెలిచారు:
 కాంగ్రెస్ - 7, టీడీపీ -3, సీపీఐ-2
 ప్రస్తుత ఎమ్మెల్యే: కె.సాంబశివరావు (సీపీఐ)
 రిజర్వేషన్: జనరల్
 నియోజకవర్గ ప్రత్యేకతలు:
 పారిశ్రామిక ప్రాంతం. సింగరేణి, కేటీపీఎస్,
 నవభారత్, ఎన్‌ఎండీసీ పరిశ్రమలు ఉన్నాయి.
 క్రిస్టియన్, ముస్లీం మైనారిటీల ఓట్లు కీలకం.
 కమ్యూనిస్టుల ప్రభావం ఉంది
 ప్రస్తుతం బరిలో నిలిచింది: 12

ప్రధాన అభ్యర్థులు వీరే..
వనమా వెంకటేశ్వరరావు (వైఎస్సార్‌సీపీ)
 కూనంనేని సాంబశివరావు (సీపీఐ)
 జలగం వెంకటరావు(టీఆర్‌ఎస్)
 కోనేరు సత్యనారాయణ (టీడీపీ)
 
 2009 ఎన్నికల్లో ఖమ్మం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన జలగం వెంకటరావుఈ సారి కొత్తగూడెంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. జలగం అనుచరులు ఇప్పుడు ఆయున వెంట లేకపోవడం, గత ఎన్నికల తర్వాత వెంకటరావు జనానికి దూరం కావడం ఇబ్బందిగా మారింది.  1969 ఉద్యమాన్ని అప్పడు హోంమంత్రిగా ఉన్న జలగం వెంగళ్రావు అణిచివేశారని విపక్షాలు చేస్తున్న ప్రచారం  వెంకట్రావుకు ప్రతికూలం కానుంది.
 
 టీడీపీలో వర్గపోరు
 తుమ్మల, నామా వర్గాల మధ్య సయోధ్య లేక టీడీపీ వర్గపోరుతో సతమతమవుతోంది. బీసీ కోటాలో బాలసాని లక్ష్మీనారాయణకు టిక్కెట్ కేటాయించి చివర్లో నామా వర్గీయుడైన కోనేరు సత్యనారాయణకు టిక్కెట్ ఇవ్వడంతో వర్గపోరు  తారాస్థారుుకి చేరింది.  పార్టీ టికెట్ ఆశించిన ఎస్టీ సెల్ నాయకుడు మాలోతు రాందాస్ నాయక్‌కు మెండిచేయి చూపడంతో ఆయన సామాజికవర్గం టీడీపీకి దూరవుయ్యే అవకాశాలు ఉన్నారుు.
 
 వైఎస్సార్ సంక్షేమ పథకాలే అండగా..
 దివంగతనేత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డికి నియోజకవర్గంతో అనుబంధం బలంగా ఉంది. వైఎస్ అవులు చేసిన సంక్షేమ పథకాలు వనవూకు కలిసిరానున్నారుు. 120 ఏళ్ల నుంచి క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్న పట్టణ ప్రజలకు వైఎస్ సీఎంగా ఉండగా జీవో 373జారీ చేసి, పట్టాలు ఇచ్చారు.  జలయజ్ఞం, ఇందిరమ్మ, పెన్షన్లు తదితర పథకాలతో లబ్ధి పొందిన ప్రజలు వనమాకు అండగా నిలిచే అవకాశం ఉంది.
 
 నే.. గెలిస్తే..
 -    కేటీపీఎస్ 7వ దశ పూర్తిచేసి స్థానికులకు ఉద్యోగాల కల్పన.
 -    {పతి గ్రామానికి కిన్నెరసాని నుంచి మంచినీరు సరఫరా.
 -    సింగరేణిలో  డిస్మిస్ అయిన కార్మికులకు తిరిగి ఉద్యోగాలు.  రిటైర్డ్ కార్మికులకు పక్కా ఇళ్ల నిర్మాణం.
-    పాల్వంచ పట్టణానికి బైపాస్ రోడ్డు నిర్మాణం.
-   కొత్త గనులతోపాటు, కొత్త పరిశ్రమలు స్థాపన.
-    కొత్తగూడెం కేంద్రంగా జిల్లా ఏర్పాటు.
 - వనమా వెంకటేశ్వరరావు (వైఎస్సార్‌సీపీ)
 
-    కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో వలిక సదుపాయాలు కల్పన.
-    పాల్వంచ, కొత్తగూడెం జంట పట్టణాలుగా అభివృద్ధి.
-    పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగేలా చర్యలు.
-   అన్ని గ్రామాలకు కిన్నెరసాని మంచినీరు.
-   కొత్తగూడెం మున్సిపాలిటీలో కొత్తగా కిన్నెరసాని పైప్‌లైన్ ఏర్పాటు.
-   పేట చెరువుపై బ్రిడ్జి నిర్మాణం.     
 - కోనేరు సత్యనారాయణ (టీడీపీ)
 
- కొత్త పరిశ్రమల ఏర్పాటు.
-నూతన బొగ్గుబావులను ప్రారంభించేందుకు చర్యలు.
- మంచినీటి సమస్య పరిష్కారం.
-దుమ్ముగూడెం ప్రాజెక్టును పూర్తి చేసి  సాగునీటి సరఫరా.
-  యువతకు ఉపాధి అవకాశాల కల్పన.
 - జలగం వెంకటరావు(టీఆర్‌ఎస్)
 
-  కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు.
-    రాంపూర్, పెనగడపలో కొత్త గనుల ఏర్పాటు.
-    కొత్తగూడెం బైపాస్ రోడ్డు సత్వరమే పూర్తి.
-   కొత్తగూడెం - పాల్వంచ రోడ్డులో  సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు.
-    సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అవులు.
-   కొత్తగూడెం జిల్లా ఏర్పాటు. కొవ్వూరు రైల్వే లైన్‌కు నిధులు మంజూరుకు కృషి.
- కూనంనేని సాంబశివరావు (సీపీఐ)
 
 జన  తెలంగాణ:  వెనక్కి పంపాలి...
 రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్న ఉద్యోగులను వారి సొంత జోన్లకు పంపాలి. 610 జీవోకు విరుద్ధంగా నియమితులైన వారిని పంపాలని తీర్పులున్నా ఇంకా వారు ఆయా కార్యాలయాల్లో కొనసాగుతున్నారు. కోర్టు ఉత్తర్వులు తమకు అందలేదని ఉన్నతాధికారులు వారిని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అలా ఉన్న వారిని గుర్తించి వెనక్కి పంపాలి.    

- చూపూరి కృష్ణమూర్తి,నారాయణగూడ, హైదరాబాద్
 
 కేసులు ఎత్తివేయాలి...
 తెలంగాణ సాధనకోసం వీరోచితంగా పోరాడిన విద్యార్థులమీద ఉన్న అన్ని కేసులను తక్షణమే ఎత్తివేయాలి. ప్రభుత్వ రంగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి. ఉద్యోగాల భర్తీలో వయోపరిమితి ఐదేళ్లు సడలించాలి. అమరులైన విద్యార్థుల తల్లిదండ్రులను ఆదుకోవాలి. ఆ కుటుంబాల్లోని పిల్లలకు ప్రభుత్వం ఉచిత విద్యావకాశాలు కల్పించాలి. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులను నేరుగా పర్మినెంట్ చేయకుండా నియామకాల్లో వారికి వెయిటేజ్ ఇవ్వాలి.
 -  జె. సంధ్యారాణి, మిర్యాలగూడ, నల్లగొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement