నామినేషన్ల హోరు | nominations local body elections 2014 | Sakshi
Sakshi News home page

నామినేషన్ల హోరు

Mar 20 2014 3:38 AM | Updated on Aug 10 2018 8:01 PM

నామినేషన్ల హోరు - Sakshi

నామినేషన్ల హోరు

జెడ్పీ, మండల పరిషత్ పోరు వేడి ఇప్పుడిప్పుడే రాజుకుంటోంది. మందకొడిగా ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఊపందుకుంది.

విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : జెడ్పీ, మండల పరిషత్ పోరు వేడి ఇప్పుడిప్పుడే రాజుకుం టోంది. మందకొడిగా ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఊపందుకుంది. బుధవారం ఒక్కరోజే జెడ్పీటీసీలకు104, ఎంపీటీసీలకు1720 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ పర్వం గురువారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది.
 
  వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం అభ్యర్థులు పోటాపోటీగా వేశారు. ఇప్పటికీ  కాంగ్రెస్ నామినేషన్ల హోరు అభ్యర్థుల విషయంలో కసరత్తు కొలిక్కి రాలేదు. 39 జెడ్పీటీసీ స్థానాల నుంచి కాంగ్రెస్ బరిలో నిలిచే పరిస్థితి కనిపిం చడం లేదు.
 
 వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ అభ్యర్థులు మాత్రం ఒక్కొక్కరు రెండు, మూ డు నామినేషన్లతో పాటు వారి కుటుంబ సభ్యులతో కూడా డెమ్మీ నామినేషన్లు వేయించారు. టీడీపీ తరపున 57, వైఎస్‌ఆర్‌సీపీ 45, కాంగ్రెస్ 6, సీపీఎం 12, సీపీఐ 2, బీజేపీ 4, బీఎస్‌పీ 1, ఇండిపెం డెంట్లు 4 మంది నామినేషన్లు వేశారు. జిల్లాలో 656 ఎంపీటీసీ స్థానాలకు ఒక్క రోజునే 1720 నామినేషన్లు వచ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement