మోడీ కోసం ‘డూప్లికేట్ ’ ప్రచారం | Narendra Modi's look-alike launches campaign for him | Sakshi
Sakshi News home page

మోడీ కోసం ‘డూప్లికేట్ ’ ప్రచారం

Mar 23 2014 4:11 PM | Updated on Sep 2 2017 5:04 AM

మోడీ కోసం ‘డూప్లికేట్ ’ ప్రచారం

మోడీ కోసం ‘డూప్లికేట్ ’ ప్రచారం

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ దేశవ్యాప్త ప్రచారంలో బిజీబిజీగా ఉంటే ఆయన కోసం ఓ ‘డూప్లికేట్’ మోడీ రంగంలోకి దిగాడు.

వడోదరా: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ దేశవ్యాప్త ప్రచారంలో బిజీబిజీగా ఉంటే ఆయన కోసం ఓ ‘డూప్లికేట్’ మోడీ రంగంలోకి దిగాడు. ఆయన పోలికలతో ఉన్న జితేంద్ర వ్యాస్ అనే స్థానికుడు మోడీ విజయం కోసం వడోదరాలో ప్రచారం చేస్తున్నాడు. మోడీ వారణాసితోపాటు వడోదరా నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

వ్యాస్ వడోదరాలో శుక్రవారం ఆలయంలో పూజ చేసి ప్రచారం ప్రారంభించాడు. ‘మోడీ దేశమంతా తిరుగుతూ ప్రచార కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నారు. ఆయన ఇక్కడ ప్రచారం చేసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించలేడు. అందుకే ఆయనకు మద్దతుగా వడోదరాలో నేను ప్రచారం చేసి రికార్డు స్థాయిలో గెలిపిస్తా’ అని వ్యాస్ చెప్పాడు.

Advertisement
 
Advertisement
Advertisement