మెట్రో రైలును అటువైపు వెళ్లనీయం: కేసీఆర్ | Metro rail must keep off Sultan Bazar, says KCR | Sakshi
Sakshi News home page

మెట్రో రైలును అటువైపు వెళ్లనీయం: కేసీఆర్

Mar 26 2014 5:55 PM | Updated on Sep 4 2018 3:39 PM

మెట్రో రైలును అటువైపు వెళ్లనీయం: కేసీఆర్ - Sakshi

మెట్రో రైలును అటువైపు వెళ్లనీయం: కేసీఆర్

మెట్రో రైలు పేరుతో సుల్తాన్‌బజార్‌, మొజంజాహి మార్కెట్ లను ధ్వంసం చేస్తే ఊరుకోబోమని కేసీఆర్ హెచ్చరించారు.

హైదరాబాద్: టీఆర్ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని కేసీఆర్ అన్నారు. తెలంగాణకు అన్యాయం చేసింది పొన్నాల లక్ష్మయ్య కాదా అని ఆయన ప్రశ్నించారు. అలాంటి వారికి తెలంగాణను అప్పగిస్తే అభివృద్ధి చెందుతుందా అని అడిగారు. అక్రమ ప్రాజెక్టులకు నీళ్లిచ్చి జైత్రయాత్రలు చేసిన చరిత్ర తెలంగాణ కాంగ్రెస్ మంత్రులదని దుయ్యబట్టారు. గిరిజనులసహా మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ హామీయిచ్చారు.

మెట్రో రైలు పేరుతో సుల్తాన్‌బజార్‌, మొజంజాహి మార్కెట్ లను ధ్వంసం చేస్తే ఊరుకోబోమని కేసీఆర్ హెచ్చరించారు. సుల్తాన్‌బజార్‌, మొజంజాహి మార్కెట్, అసెంబ్లీ మీదుగా మెట్రో రైలును వెళ్లనిచ్చే ప్రసక్తే లేదన్నారు. ఆ ప్రాంతంలో అండర్‌గ్రౌండ్‌ పనులు చేపట్టాలని సూచించారు. ఇదే విషయాన్ని ఎల్‌అండ్‌టీ అధికారులకు స్పష్టం చేశామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement