'లగడపాటి ఎలాంటి సర్వేలు చేయించలేదు' | Lagadapati rajagopal does not any survey, says ambati rambabu | Sakshi
Sakshi News home page

'లగడపాటి ఎలాంటి సర్వేలు చేయించలేదు'

May 15 2014 4:28 PM | Updated on Aug 10 2018 8:06 PM

'లగడపాటి ఎలాంటి సర్వేలు చేయించలేదు' - Sakshi

'లగడపాటి ఎలాంటి సర్వేలు చేయించలేదు'

లగడపాటి రాజగోపాల్ ఎలాంటి సర్వేలు చేయించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సత్తెనపల్లి అభ్యర్థి అంబటి రాంబాబు అన్నారు.

గుంటూరు : లగడపాటి రాజగోపాల్ ఎలాంటి సర్వేలు చేయించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సత్తెనపల్లి అభ్యర్థి అంబటి రాంబాబు అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ లగడపాటి నిజంగా సర్వే చేయించి ఉంటే ఏ సంస్థలో చేయించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని అంబటి అన్నారు.

లగడపాటి సర్వేను నమ్మి ఎవరూ పందాలు కాయొద్దని అంబటి సూచించారు. జాతీయ సంస్థలన్ని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని వెల్లడించాయని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల మధ్య నెలరోజుల సమయం ఉందని, ఆ సమయంలో చాలా మార్పులు జరిగాయని అంబటి పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు తాము పోటీ చేయలేమంటూ చేతులెత్తేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 110కంటే ఎక్కువ సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని అంబటి ధీమా వ్యక్తం చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement