కేసీఆర్‌కు దెయ్యం పట్టినట్లుంది: కిషన్‌రెడ్డి | kishan reddy fire to kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు దెయ్యం పట్టినట్లుంది: కిషన్‌రెడ్డి

Apr 26 2014 4:23 AM | Updated on Mar 29 2019 9:24 PM

కేసీఆర్‌కు దెయ్యం పట్టినట్లుంది: కిషన్‌రెడ్డి - Sakshi

కేసీఆర్‌కు దెయ్యం పట్టినట్లుంది: కిషన్‌రెడ్డి

టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు దెయ్యం పట్టినట్టయిందని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు

మంచిర్యాల/భూపాలపల్లి, : టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు దెయ్యం పట్టినట్టయిందని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని మంచి ర్యాల, చెన్నూర్, వరంగల్ జిల్లా భూపాలపల్లిలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి న రేంద్రమోడీ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ‘ఫాంహౌస్‌లో పడుకున్నప్పుడు కేసీఆర్‌కు దెయ్యం పట్టినట్లుంది.

అందుకే మాపై విమర్శలు చేస్తున్నారు. వైఖరి మార్చుకోకపోతే సహించం’ అని హెచ్చరించారు. 2009 ఎన్నికల్లో చంద్రబాబుతో కేసీఆర్ కుదుర్చుకున్న పొత్తు ఒప్పు అయినప్పుడు తమ పొత్తు తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. కేసీఆర్ తన పదేళ్ల పదవీ కాలంలో ఏనాడైనా పార్లమెంటులో తెలంగాణపై మాట్లాడారా అని ప్రశ్నించారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement