ఇప్పుడు టీడీపీకి గుర్తుగా ఉన్న సైకిల్ 1983కు ముందు ఇండిపెండెంట్లకు కేటాయించేవారు. ఇదిగో అదే సైకిల్ గుర్తుపై ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన చరిత్ర కరీంనగర్ జిల్లా బుగ్గారం సెగ్మెంట్‌కు సొంతం.
ఇప్పుడు టీడీపీకి గుర్తుగా ఉన్న సైకిల్ 1983కు ముందు ఇండిపెండెంట్లకు కేటాయించేవారు. ఇదిగో అదే సైకిల్ గుర్తుపై ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన చరిత్ర కరీంనగర్ జిల్లా బుగ్గారం సెగ్మెంట్‌కు సొంతం. బుగ్గారం నియోజకవర్గం 2009 పునర్విభజనతో కనుమరుగైంది. 1962 అసెంబ్లీ ఎన్నికల్లో బుగ్గారం నుంచి కాంగ్రెస్ తరపున ఎ. మోహన్‌రెడ్డి, ఇండిపెండెంట్‌గా కోరుట్ల మండలం జోగన్‌పల్లికి చెందిన ఏనుగు నారాయణరెడ్డి పోటీ పడ్డారు. నారాయణరెడ్డికి ఎన్నికల సంఘం సైకిల్ గుర్తు కేటాయించింది.
కాంగ్రెస్, ఇండిపెండెంట్ల మధ్యనే హోరాహోరీగా పోటీ సాగింది. నారాయణరెడ్డి నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో సైకిల్‌పైనే తిరుగుతూ ప్రచారం సాగించారు. ఆ సమయంలో సైకిల్ గుర్తు అందరినీ ఆకట్టుకుంది. చివరికి సైకిల్ గుర్తుపై పోటీ చేసిన నారాయణరెడ్డికి 20,807 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి మోహన్‌రెడ్డికి 20,493 ఓట్లు వచ్చాయి. కేవలం 300పై చిలుకు ఓట్ల తేడాతో నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదీ స్వతంత్రుల సైకిల్ సంగతి.
- న్యూస్‌లైన్, కోరుట్ల