వారణాసిలో మోడీని ఓడిస్తా: కేజ్రీవాల్ | I will defeat narendra modi in Varanasi, says Arvind Kejriwal | Sakshi
Sakshi News home page

వారణాసిలో మోడీని ఓడిస్తా: కేజ్రీవాల్

Mar 18 2014 8:01 PM | Updated on Mar 9 2019 3:34 PM

వారణాసిలో మోడీని ఓడిస్తా: కేజ్రీవాల్ - Sakshi

వారణాసిలో మోడీని ఓడిస్తా: కేజ్రీవాల్

వారణాసిలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీపై కేవలం పోటీ చేయడానికే తాను పరిమితం కానని, ఆయనను ఓడించి తీరుతానని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ అంటున్నారు.

వారణాసిలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీపై కేవలం పోటీ చేయడానికే తాను పరిమితం కానని, ఆయనను ఓడించి తీరుతానని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ అంటున్నారు. ఇదేదో ఉత్తుత్తి పోటీయే అవుతుందని, మోడీ సులభంగా గెలుస్తారని కొన్ని వార్తా పత్రికలలో తాను చదివానని, కానీ ఆయనకు తనది గట్టి పోరాటమని చెప్పదలచుకున్నానని కేజ్రీవాల్ అన్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో తాము సాధించిన విజయం లోక్సభ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతుందని చెప్పారు. ఢిల్లీలో తమ అభ్యర్థులెవరో ఎవరికీ తెలియకపోయినా, అప్పటికి 20 ఏళ్లుగా ఎమ్మెల్యేలుగా ఉన్నవారిని కూడా ఓడించారని, ఇదే చరిత్ర 2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మోడీని కావాలనుకుంటున్నారో, తాను గెలవాలనుకుంటున్నారో తెలుసుకోడానికి త్వరలోనే వారణాసిలో ఓ ర్యాలీ నిర్వహిస్తానని కేజ్రీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement