హామీలలో దానకర్ణుడు.. తదుపరి కుంభకర్ణుడు | election campaign sabha at janagama:g.kishan reddy | Sakshi
Sakshi News home page

హామీలలో దానకర్ణుడు.. తదుపరి కుంభకర్ణుడు

Apr 28 2014 12:54 AM | Updated on Mar 29 2019 5:32 PM

హామీలలో దానకర్ణుడు.. తదుపరి కుంభకర్ణుడు - Sakshi

హామీలలో దానకర్ణుడు.. తదుపరి కుంభకర్ణుడు

టీఆర్‌ఎస్ బొమ్మా బొరుసులాంటి పార్టీ అని, దాన్ని పట్టుకుంటే.. కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు.

కేసీఆర్‌పై బీజేపీ నేత కిషన్‌రెడ్డి విసుర్లు

జనగామ, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ బొమ్మా బొరుసులాంటి పార్టీ అని, దాన్ని పట్టుకుంటే.. కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా జనగామలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారసభలో మాట్లాడారు. కేసీఆర్ ఎన్నికలప్పుడు హామీలలో దానకర్ణుడని.. తదుపరి కుంభకర్ణుడని విమర్శించారు.

ఆయన మాటలు నమ్మొద్దన్నారు. కేసీఆర్ ఉద్యమంలో పాల్గొని చేసింది తక్కువేనని చెప్పారు. నరేంద్ర మోడీని విమర్శిస్తే సహించమన్నారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని, ఓటు అడిగే హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు.  టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో తెలంగాణ రాలేదని, 1100 మంది ఆత్మబలిదానాలు, ప్రజాపోరాటంతోనే వచ్చిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement