పవన్‌పై పరువునష్టం దావా వేస్తా: హరీశ్ | Defamation suit on pawan:harish | Sakshi
Sakshi News home page

పవన్‌పై పరువునష్టం దావా వేస్తా: హరీశ్

Apr 28 2014 2:50 AM | Updated on Mar 22 2019 5:29 PM

పవన్‌పై పరువునష్టం దావా వేస్తా: హరీశ్ - Sakshi

పవన్‌పై పరువునష్టం దావా వేస్తా: హరీశ్

పీసీసీ మాజీ అధ్యక్షులు బొత్సతో తనకు వ్యాపార సంబంధాలున్నాయని ఆరోపించిన పవన్‌కల్యాణ్‌పై పరువు నష్టం దావా వేస్తానని టీఆర్‌ఎస్ నేత తన్నీరు హరీశ్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సాక్షి, హైదరాబాద్: పీసీసీ మాజీ అధ్యక్షులు బొత్సతో తనకు వ్యాపార సంబంధాలున్నాయని ఆరోపించిన పవన్‌కల్యాణ్‌పై పరువు నష్టం దావా వేస్తానని టీఆర్‌ఎస్ నేత తన్నీరు హరీశ్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బొత్సతో కేబుల్ వ్యాపార సంబంధాలున్నట్లు చేసిన ఆరోపణలను ఖండించారు.

 

ఆయన చేసిన ఆరోపణలను 24 గంటలల్లోగా నిరూపించాలని, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. లేని పక్షంలో దావాతో పాటు క్రిమినల్ కేసు పెడతానని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ నాయకుల ప్రతిష్టను దిగజార్చడానికి ఇలాంటి తప్పుడు ఆరోపణలు గతంలోనూ చేశారని, ఇప్పుడు కూడా అదే పద్దతి కొనసాగిస్తున్నారన్నారు

Advertisement
 
Advertisement
Advertisement