కాంగ్రెస్ తప్పు చేసింది: వీరప్ప మొయిలీ | Congress has made a mistake: Veerappa Moily | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ తప్పు చేసింది: వీరప్ప మొయిలీ

May 21 2014 8:47 PM | Updated on Mar 18 2019 9:02 PM

వీరప్ప మొయిలీ - Sakshi

వీరప్ప మొయిలీ

కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ అభిప్రాయపడ్డారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ అభిప్రాయపడ్డారు.  ఎన్నికలలో ఓటమిని సమీక్షిస్తూ మనల్ని ప్రజలు నమ్మని పరిస్థితి ఏర్పడిందన్నారు. లోక్సభను నడపలేని మనం దేశాన్ని ఎలా  నడపగలం అని ప్రశ్నించారు.  అధికార యంత్రాంగం ప్రధాని మన్మోహన్ సింగ్కు  మద్దతు పలకలేదని చెప్పారు. కార్యక్రమాల అమలులో ప్రభుత్వ వేగం మందగించిందన్నారు.

ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని  ప్రతిపక్ష నేతగా ఎన్నికోవాలని కోరారు. ప్రియాంక వధేరా పార్టీలో కీలకపాత్ర పోహించాలన్నారు. గ్రామస్థాయి నుంచి ఏఐసిసి వరకు పార్టీని  ప్రక్షాళన చేయాలని మొయిలీ డిమాండ్ చేశారు. పార్టీలో స్థానిక, ప్రాంతీయ నాయకత్వాన్ని అభివృద్ధి చేయలేకపోయామని అన్నారు.  ఓటమికి బాధ్యులను నిర్థారించి వారిపై చర్య తీసుకోవాలన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement