వైఎస్ఆర్ సీపీలోకి ఊపందుకున్న వలసలు | congress ex mla ganta murali ramakrishna joins ysr congress party | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీలోకి ఊపందుకున్న వలసలు

Apr 11 2014 2:12 PM | Updated on May 25 2018 9:12 PM

వైఎస్ఆర్ సీపీలోకి ఊపందుకున్న వలసలు - Sakshi

వైఎస్ఆర్ సీపీలోకి ఊపందుకున్న వలసలు

వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ కృష్ణ తన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు.

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ తన అనుచరులతో కలిసి శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ విజయానికి తనవంతు కృషి చేస్తానన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే సీమాంధ్రలో అభివృద్ధి జరుగుతుందన్నారు.

 కాగా గంటా మురళికి మంచి పట్టు ఉండటంతో ఆయన చేరికతో చింతలపూడి నియోజకవర్గంలోని కాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్‌ సీపీ మరింత బలపడనుంది. కాగా విజ్ఞాన్‌ సంస్థలు అధినేత లావు రత్తయ్య కూడా ఇవాళ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో  వైఎస్‌ఆర్‌ సీపీలో చేరారు.

Advertisement
 
Advertisement
Advertisement