పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు | Chandrababu went to Pawan kalyan house | Sakshi
Sakshi News home page

పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు

Apr 23 2014 1:14 PM | Updated on Mar 22 2019 5:33 PM

చంద్రబాబు-పవన్ కళ్యాణ్ - Sakshi

చంద్రబాబు-పవన్ కళ్యాణ్

పిలవకుండానే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు.

హైదరాబాద్: పిలవకుండానే  టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. ఎన్నికల ప్రచారంపై వారు చర్చించారు. ప్రచారంలో పాల్గొని తమ పార్టీకి మద్దతు ఇవ్వమని చంద్రబాబు పవన్ కళ్యాణ్ను కోరారు. అనంతరం పవన్ కళ్యాణ్ విలేకరులతో మాట్లాడుతూ ఓట్లు చీలిపోకూడదనే తమ పార్టీ  పోటీ చేయడంలేదని చెప్పారు.

మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి లోక్సత్తా తరపున పోటీ చేస్తున్న జయప్రకాశ్ నారాయణ అంటే తనకు ఇష్టం అని చెప్పారు. అయితే కూటమి ధర్మం ప్రకారం మల్కాజ్గిరిలో మల్లారెడ్డికే మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. టిఆర్ఎస్ శ్రవణ్ వంటి నేతకు అన్యాయం చేసిందని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement