బాబును ముప్పు‘తిప్ప’లు పెట్టింది | Chandrababu naidu confusion over condidates names in kurnool compaigning | Sakshi
Sakshi News home page

బాబును ముప్పు‘తిప్ప’లు పెట్టింది

Apr 26 2014 10:05 AM | Updated on Aug 14 2018 4:32 PM

బాబును ముప్పు‘తిప్ప’లు పెట్టింది - Sakshi

బాబును ముప్పు‘తిప్ప’లు పెట్టింది

కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకొని ఎంతోకాలంగా పార్టీకి సేవలందిస్తున్న తమ్ముళ్లకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబబాబు నాయుడు చేయిచ్చారు.

కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకొని ఎంతోకాలంగా పార్టీకి సేవలందిస్తున్న తమ్ముళ్లకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబబాబు నాయుడు చేయిచ్చారు.. ఆ తర్వాత పలుమార్లు అభ్యర్థులను మార్పు చేశారు.. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లను కూడా గుర్తు పెట్టుకోలేకపోతున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కోసిగి బహిరంగ సభలో మంత్రాలయం అభ్యర్థిని ప్రజలకు పరిచయం చేస్తూ.. పాలకుర్తి తిక్కారెడ్డికి బదులుగా తిప్పారెడ్డి అని పేర్కొనడం తమ్ముళ్లకు నవ్వు తెప్పించింది. ఏదో పొరపాటు అన్నారనుకుంటే.. మూడుసార్లు ఇదే పేరు ఉచ్ఛరించడం గమనార్హం. పక్కనే ఉన్న ఎంపీ అభ్యర్థి బి.టి.నాయుడు పేరు తప్పని పదేపదే ఆయన చెవు కొరికినా ఫలితం లేకపోయింది. మొత్తానికి తిక్కారెడ్డి పేరు బాబును ముప్పు‘తిప్ప’లు పెట్టింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement