అమిత్ షా తీవ్రవాది: లాలూ ప్రసాద్ | Amit Shah a terrorist : Lalu Prasad Yadav | Sakshi
Sakshi News home page

అమిత్ షా తీవ్రవాది: లాలూ ప్రసాద్

May 6 2014 5:29 PM | Updated on Aug 14 2018 4:24 PM

అమిత్ షా తీవ్రవాది: లాలూ ప్రసాద్ - Sakshi

అమిత్ షా తీవ్రవాది: లాలూ ప్రసాద్

నరేంద్ర మోడీ సన్నిహితుడు, గుజరాత్ మాజీ మంత్రి అమిత్ షాపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పాట్నా: నరేంద్ర మోడీ సన్నిహితుడు, గుజరాత్ మాజీ మంత్రి అమిత్ షాపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమిత్ షా తీవ్రవాది అంటూ మండిపడ్డారు. నరేంద్ర మోడీకి కుడిభుజంగా వ్యవహరించిన అమిత్ షా... గుజరాత్, ముజాఫర్నగర్ అల్లర్లకు కారకుడని ఆరోపించారు. మతకలహాలు రెచ్చగొట్టడం ద్వారా దేశాన్ని నాశనం చేయాలని వీరు చూస్తున్నారని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో మోడీ, అమిత్ షా నిజస్వరూపాలు బయటపడుతున్నాయని వ్యాఖ్యానించారు.

ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్ తీవ్రవాదుల అడ్డాగా మారిందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై లాలూ ప్రసాద్ యాదవ్ పైవిధంగా స్పందించారు. కాగా, అమిత్ షా వ్యాఖ్యలతో ప్రత్యర్థి పార్టీలు విరుచుకుపడ్డాయి. ఆయనపై ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

Advertisement
 
Advertisement
Advertisement