పక్కాఇళ్లు.. వాటికి పావలా వడ్డీకే రుణం | 10 lakh pakka houses for poor, promisses ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

పక్కాఇళ్లు.. వాటికి పావలా వడ్డీకే రుణం

May 1 2014 10:51 AM | Updated on Aug 14 2018 4:24 PM

పక్కాఇళ్లు.. వాటికి పావలా వడ్డీకే రుణం - Sakshi

పక్కాఇళ్లు.. వాటికి పావలా వడ్డీకే రుణం

పక్కా ఇళ్లు కట్టించడమే కాదు..వాటిపై పావలా వడ్డీకి 30 వేల రూపాయల రుణం ఇప్పిస్తామన్నారు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.

పక్కా ఇళ్లు కట్టించడమే కాదు..వాటిపై పావలా వడ్డీకి 30 వేల రూపాయల రుణం ఇప్పిస్తామన్నారు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. 2019 నాటికి గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు . ఏడాదికి 10 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తానన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశం మొత్తం మీద 47 లక్షల ఇళ్లు కడితే..రాష్ట్రంలో మహానేత ఒక్కరే 48 లక్షల ఇళ్లు కట్టించారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా ఉయ్యూరులో వైఎస్‌ జగన్ వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు.

ఇక సీమాంధ్రలో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే సమైక్య ఉద్యమంలో విద్యార్ధులపై పెట్టిన కేసులను ఎత్తేస్తామన్నారు వైఎస్‌ విజయమ్మ. వైఎస్‌ఆర్‌ మరణం తమకు తీరని లోటని చెప్పారు. వైఎస్‌ జగన్‌ ప్రజల్లో కలిసిపోతారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement