లోకేశ్‌ దిగజారుడు రాజకీయం! | Netizens are now saying that Nara Lokesh made that post intentionally | Sakshi
Sakshi News home page

లోకేశ్‌ దిగజారుడు రాజకీయం!

Apr 20 2026 4:41 AM | Updated on Apr 20 2026 12:31 PM

Netizens are now saying that Nara Lokesh made that post intentionally

ఎన్నడూ లేనిది వైఎస్‌ విజయమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఎక్స్‌’లో పోస్టు 

గతంలో వైఎస్‌ విజయమ్మకు కనీస గౌరవం ఇవ్వని వైనం 

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తల్లికి ఏనాడూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపని లోకేశ్‌ 

ఇప్పుడు ఉద్దేశ పూర్వకంగానే ఆ పోస్టు పెట్టారంటున్న నెటిజన్లు

సాక్షి, అమరావతి: రాజకీయాల్లో ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతిసారీ అంతకంటే దిగువకు దిగజారి రాజకీయ విశ్లేషకులను నివ్వెరపోయేలా చేసే సీఎం చంద్రబాబునాయుడు కంటే ఆయన తయుడు లోకేశ్‌ మరింత దిగజారిపోయారంటూ సామాజిక మధ్యమాల్లో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తల్లి వైఎస్‌ విజయమ్మ వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా వైఎస్‌ విజయ అని సంబోధిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసిన నారా లోకేశ్‌ ఇప్పుడు రాజకీయంగా మరింతగా దిగజారుతూ వైఎస్‌ విజయమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారంటూ ఎత్తిచూపుతున్నారు. 

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తల్లికి గతంలో ఎప్పుడైనా నారా లోకేశ్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారా.. అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దిగజారుడు రాజకీయాల్లో భాగంగానే ఎన్నడూ లేని రీతిలో వైఎస్‌ విజయమ్మపై లేని ప్రేమను ఒలకబోస్తూ లోకేశ్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం (ఏప్రిల్‌ 19) వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తల్లి వైఎస్‌ విజయమ్మ పుట్టిన రోజు. 

ఈ సందర్భంగా వైఎస్‌ విజయమ్మను పులువురు నేరుగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మరికొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. అయితే గతంలో ఎన్నడూ విజయమ్మకు శుభాకాంక్షలు తెలుపని, కనీస గౌరవం ఇవ్వని సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్‌.. ప్రస్తుతం దిగజారుడు రాజకీయంలో భాగంగానే ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement