చంద్రబాబుది దుర్మార్గ పాలన | YSRCP MLAs takes on chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుది దుర్మార్గ పాలన

Sep 16 2015 11:30 AM | Updated on Jul 28 2018 3:30 PM

ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలనపై అనంతపురం జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్బాషాలు మండిపడ్డారు.

అనంతపురం : ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలనపై అనంతపురం జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్బాషాలు మండిపడ్డారు.  బుధవారం అనంతపురంలో వారు మాట్లాడారు. చంద్రబాబు పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. వారం రోజుల ముందే బెలుగుప్ప ధర్నాకు అనుమతి అడిగినా... ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తారా అంటూ టీడీపీ నేతలను విశ్వేశ్వరరెడ్డి నిలదీశారు.

చిల్లర రాజకీయాలు మానుకోవాలంటూ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్కు హితవు పలికారు. మరో ఎమ్మెల్యే చాంద్బాషా మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ఆర్ ని అభిమానించే వారందరిని చంపుతారా అని ప్రశ్నించారు. చంద్రబాబుది దుర్మార్గమైన పాలన అని చాంద్బాషా అభివర్ణించారు.

Advertisement
 
Advertisement
Advertisement