'డబ్బులకు అమ్ముడుపోయిన చాంద్‌బాషా' | ysrcp leaders and supporters Protest in Kadiri | Sakshi
Sakshi News home page

'డబ్బులకు అమ్ముడుపోయిన చాంద్‌బాషా'

Apr 23 2016 12:38 PM | Updated on Sep 3 2017 10:35 PM

అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్బాషా...టీడీపీలో చేరడాన్ని వ్యతిరేకిస్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మైనారిటీలు శనివారం కదిరి పట్టణంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

కదిరి: అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్బాషా...టీడీపీలో చేరడాన్ని వ్యతిరేకిస్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మైనారిటీలు శనివారం కదిరి పట్టణంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. డబ్బులకు అమ్ముడుపోయిన చాంద్‌బాషా అంటూ స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

అనంతరం  ఎమ్మెల్యే చాంద్బాష దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే ఎమ్మెల్యేకి చెందిన లాడ్జి ముందు ధర్నాకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సీఈసీ సభ్యుడు జక్కాల ఆదిశేషు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, మైనారిటీలు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement