వలసలు నాయకులే..ఓటర్లు కాదు.. | ysrcp leader saradhi press meet | Sakshi
Sakshi News home page

వలసలు నాయకులే..ఓటర్లు కాదు..

Dec 23 2016 8:00 PM | Updated on May 29 2018 3:42 PM

వలసలు నాయకులే..ఓటర్లు కాదు.. - Sakshi

వలసలు నాయకులే..ఓటర్లు కాదు..

వలస వెళుతున్నది నాయకులే కానీ ఓటర్లు కాదని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్దసారథి పేర్కొన్నారు. పామర్రు శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన టీడీపీలో చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కొలుసు పార్దసారథి, తోట్లవల్లూరు ఎంపీపీ కళ్లెం వెంకటేశ్వరరెడ్డితో కలిసి గురువారం రాత్రి మొవ్వ మండలం కూచిపూడికి విచ్చేశారు.

కూచిపూడి: వలస వెళుతున్నది నాయకులే కానీ ఓటర్లు కాదని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్దసారథి పేర్కొన్నారు. పామర్రు శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన టీడీపీలో చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కొలుసు పార్దసారథి, తోట్లవల్లూరు ఎంపీపీ కళ్లెం వెంకటేశ్వరరెడ్డితో కలిసి గురువారం రాత్రి మొవ్వ మండలం కూచిపూడికి విచ్చేశారు. వైఎస్సార్‌ సీపీ మొవ్వ మండల అధ్యక్షుడు రాజులపాటి రాఘవరావు కార్యాలయంలో ప్రజాప్రతినిధులతో, వైసీపీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు.  కల్పన పార్టీ మారటంతో ఏర్పడే సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపి నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కల్పన పిలుపునకు స్పందన నిల్‌
తనతో పాటు టీడీపీలో చేరాలని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పిలుపునకు స్పందని కనిపించలేదు. మండలం నుంచి ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా టీడీపీలో చేరటానికి వెళ్ళలేదు.

Advertisement
 
Advertisement
Advertisement