‘వైఎస్ జగన్ సభకు యువత పోటెత్తారు’ | YSRCP leader balineni srinivas reddy prticipates in Gadapa Gadapaku YSR | Sakshi
Sakshi News home page

‘వైఎస్ జగన్ సభకు యువత పోటెత్తారు’

Nov 7 2016 6:30 PM | Updated on May 29 2018 4:26 PM

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ఉద్యమానికి ప్రజల నుంచి అనూహ్యమైన మద్దతు..

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ఉద్యమానికి ప్రజల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తుందని వైఎస్ఆర్ సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హోదాతోనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని బాలినేని అన్నారు. ప్రతి ఒక్కరు ప్రత్యేక హోదా రావాలని కోరుకుంటుంటే చంద్రబాబు మాత్రం ప్రత్యేక ప్యాకేజిలు తీసుకుని ప్రజలను మోసం చేస్తున్నాడని బాలినేని విమర్శించారు. ఒంగోలు ఇస్లాంపేటలో సోమవారం జరిగిన గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ విశాఖలో వైఎస్ జగన్ సభకు యువత పోటెత్తారన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్ ఎంత బలంగా ఉందో, సభకు వచ్చినవారిని చూస్తే తెలుస్తోందని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని బాలినేని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement