రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన ముఖ్యమంత్రి | ysrcp dist general secretary fires on cm | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన ముఖ్యమంత్రి

Apr 3 2017 12:40 AM | Updated on May 29 2018 3:40 PM

అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగా, అనైతికంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని వైఎస్సార్‌సీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలువ వెంకట రాముడు ఓ ప్రకటనలో విమర్శించారు. పార్టీ ఫిరాయించిన వారితో రాజీనామా చేయించకుండా వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.

వైఎస్సార్‌సీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ధ్వజం 
 
అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగా, అనైతికంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని వైఎస్సార్‌సీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలువ వెంకట రాముడు ఓ ప్రకటనలో విమర్శించారు.  పార్టీ ఫిరాయించిన వారితో రాజీనామా చేయించకుండా వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. వైఎస్‌ కుటుంబాన్ని అదేపనిగా తిడుతున్నవారికి, తన అవినీతి అక్రమాలకు  వంత పాడుతున్న వారికి మంత్రి వర్గంలో చోటు కల్పించారని మండిపడ్డారు. విశ్వాసఘాతకుడైన జమ్ముల మడుగు ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి, అసెంబ్లీలో చంద్రబాబు అవినీతి అక్రమాలకు వత్తాసు పలుకుతున్న చీప్‌ విప్‌ కాలువ శ్రీనివాసులుకు మంత్రి పదవులు కట్టబెట్టడం దుర్మార్గ చర్య అని ఆయన అభివర్ణించారు.

Advertisement
 
Advertisement
Advertisement