వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేసిన మేయర్ | ysrcp corporators suspended by vijayawada mayor koneru sridhar | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేసిన మేయర్

Sep 23 2016 11:50 AM | Updated on May 29 2018 3:40 PM

వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేసిన మేయర్ - Sakshi

వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేసిన మేయర్

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం శుక్రవారం రసాభాసగా మారింది.

విజయవాడ : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం శుక్రవారం రసాభాసగా మారింది. సమావేశం ప్రారంభమైన వెంటనే కృష్ణా పుష్కర పనుల్లో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ జరపాలని వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. అందుకు అధ్యక్ష స్థానంలో ఉన్న మేయర్ కోనేరు శ్రీధర్ ససేమిరా అన్నారు. దీంతో ఆగ్రహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు... మేయర్ పోడియం వద్దకు బైఠాయించారు.

మేయర్ కోనేరు శ్రీధర్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మేయర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో మేయర్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మేయర్ సస్పెన్షన్ను నిరసిస్తూ... కౌన్సిల్ హాల్లోనే వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement