బంద్‌ సంపూర్ణం | ysrcp bundh success | Sakshi
Sakshi News home page

బంద్‌ సంపూర్ణం

Aug 2 2016 5:04 PM | Updated on Oct 4 2018 4:39 PM

నిర్మానుష్యంగా మారిన అనంతపురం శ్రీకంఠం సర్కిల్ - Sakshi

నిర్మానుష్యంగా మారిన అనంతపురం శ్రీకంఠం సర్కిల్

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌తో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చి పిలుపుమేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా బంద్‌ జరిగింది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్‌ పాల్గొని ఏపీ ప్రత్యేకల హోదా ఇవ్వాల్సిందేనంటూ నినదించారు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌కు  ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌తో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చి పిలుపుమేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా బంద్‌ జరిగింది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్‌ పాల్గొని ఏపీ ప్రత్యేకల హోదా ఇవ్వాల్సిందేనంటూ నినదించారు. స్కూళ్లు, పాఠశాలలు, సినిమాహాళ్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నీ మూతపడడంతో జిల్లాలోని వివిధ పట్టణాలతో పాటు అనంతపురంలోని ప్రధాన నగరాలన్నీ నిర్మానుష్యంగా మారాయి.  బంద్‌కు ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కూడా మద్దతు తెలపడంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసిన నేతలను స్టేషన్‌లకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం జరిగిన బంద్‌ సంపూర్ణంగా ముగిసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement