ప్రాక్టికల్స్‌కు పరికరాలేవీ? | YSR Students Union stages protest | Sakshi
Sakshi News home page

ప్రాక్టికల్స్‌కు పరికరాలేవీ?

Nov 11 2016 1:01 AM | Updated on Oct 20 2018 6:19 PM

ప్రాక్టికల్స్‌కు పరికరాలేవీ? - Sakshi

ప్రాక్టికల్స్‌కు పరికరాలేవీ?

నెల్లూరు (టౌన్‌): విద్యార్థుల నుంచి ఫీజుల పేరుతో రూ.లక్షలు వసూలు చేస్తూ శ్రీచైతన్య కళాశాల్లో ప్రాక్టికల్స్‌కు కనీసం పరికరాలు కూడా లేవని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు శేషు తెలిపారు.

  •  వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ధర్నా
  • నెల్లూరు (టౌన్‌):
    విద్యార్థుల నుంచి ఫీజుల పేరుతో రూ.లక్షలు వసూలు చేస్తూ శ్రీచైతన్య కళాశాల్లో ప్రాక్టికల్స్‌కు కనీసం పరికరాలు కూడా లేవని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు శేషు తెలిపారు. గురువారం స్థానిక రామలింగాపురంలోని శ్రీచైతన్య కళాశాల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల్లో సగం మంది విద్యార్థులకు కూడా సరిపడా పరికరాలు లేవన్నారు. అధికారులు తనిఖీలకు వెళ్లిన సమయంలో ఒక క్యాంపస్‌లో ఉన్న పరికరాలను మరో క్యాంపస్‌లోకి తీసుకెళ్లి ప్రాక్టికల్స్‌ను తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల నుంచి ల్యాబ్‌ల పేరుతో ప్రత్యేకంగా ఫీజలు వసూళ్లు చేస్తున్నారని తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచి జంబ్లింగ్‌ విధానంలో ప్రాక్టికల్స్‌ జరుగుతాయని విద్యాశాఖాధికారులు చెప్పినా కళాశాల యాజమాన్యం నేటికీ పరికరాలను అందుబాటులో ఉంచకపోవడం దారుణమన్నారు. కళాశాల్లో ఎలాంటి ప్రయోగాలు నిర్వహించకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో పరికరాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement