'వైఎస్ఆర్ బతికుంటే ప్రతి ఎకరాకు సాగునీరు' | YSR still alive in people hearts, says ys sharmila | Sakshi
Sakshi News home page

'వైఎస్ఆర్ బతికుంటే ప్రతి ఎకరాకు సాగునీరు'

Oct 2 2015 8:55 PM | Updated on Sep 3 2017 10:21 AM

'వైఎస్ఆర్ బతికుంటే ప్రతి ఎకరాకు సాగునీరు'

'వైఎస్ఆర్ బతికుంటే ప్రతి ఎకరాకు సాగునీరు'

ప్రజల బాధను తన బాధగా మలుచుకున్న వ్యక్తి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని ఆయన కుమార్తె వైఎస్ షర్మిల అన్నారు.

కరీంనగర్ :  ప్రజల బాధను తన బాధగా మలుచుకున్న వ్యక్తి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని ఆయన కుమార్తె వైఎస్ షర్మిల అన్నారు. అందుకే రాజన్నగా ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా పరామర్శ యాత్రలో ఉన్న ఆమె శుక్రవారం హుజురాబాద్, మానకొండూరులో ఏడు కుటుంబాలను పరామర్శించారు.

ఈ సందర్భంగా తెలంగాణ చౌక్ వద్ద వైఎస్ షర్మిల మాట్లాడుతూ  వైఎస్ఆర్ బతికుంటే ప్రతి ఎకరాకు సాగునీరు అందేదని, పేదలకు ఇళ్లు, ఉచిత విద్య, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేదని అన్నారు. అలాగే రైతులకు 9గంటల కరెంట్ వచ్చేదని వైఎస్ షర్మిల అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement