తొలిరోజు ముగిసిన వైఎస్ షర్మిల పరామర్శయాత్ర | Ys sharmila tour first end in Nizamabad district | Sakshi
Sakshi News home page

తొలిరోజు ముగిసిన వైఎస్ షర్మిల పరామర్శయాత్ర

Jan 7 2016 8:34 PM | Updated on Oct 17 2018 6:14 PM

నిజామాబాద్ జిల్లాలో రెండో విడత పరామర్శయాత్రలో భాగంగా గురువారం వైఎస్ షర్మిల తొలిరోజు పరామర్శయాత్ర ముగిసింది.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో వైఎస్ షర్మిల తొలిరోజు పరామర్శయాత్ర ముగిసింది. రెండో విడత పరామర్శయాత్రలో భాగంగా గురువారం నిజామాబాద్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర ప్రారంభమైంది. పిట్లం వద్ద షర్మిలకు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

ఈ యాత్రలో భాగంగా పిట్లం మండలం చిల్లర్గిలో భట్టు చిన్నబాలయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అనంతరం జుక్కల్ మండలకేంద్రంలో నేదరి శిఖామణి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. రాజన్నపాలనను తిరిగి తెచ్చుకోవాలని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంది ఒక్క వైఎస్సారేనని షర్మిల గుర్తు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement