‘అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది పొట్టగొట్టారు’

Outsourcing Staff Protesting the VC of Telangana University On the Way to the Farewell Event - Sakshi

తెయూ వీసీ వీడ్కోలు సభకు వెళ్తున్న వీసీ సాంబయ్యను అడ్డుకుని నిరసన 

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ వీ సీ ప్రొఫెసర్‌ సాంబయ్యను అవుట్‌ సోర్సింగ్‌ సి బ్బంది అడ్డుకుని నిరసన తెలిపారు. వీసీ మూడే ళ్ల పదవీకాలం బుధవారం ముగిసింది. గురువా రం వీడ్కోలు సన్మాన కార్యక్రమానికి వెళ్లేందుకు వీసీ సిద్ధమయ్యారు. ఇంతలోనే వీసీ రెసిడెన్స్‌ వ ద్దకు చేరుకున్న అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది అక్క డే బైటాయించి ధర్నా నిర్వహించారు. జీవో నెంబరు 14 ప్రకారం వేతనాలు పెంచకుండా తమకు తీవ్ర అన్యాయం చేశాడరని ఆరోపించారు. మూడేళ్ల కాలంలో వీసీ ఒక నియంతలా వ్య వహరించారని, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని తీ వ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెసిడెన్స్‌ నుంచి బయటకు వచ్చిన వీసీ సాంబయ్యను చుట్టుముట్టిన అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది తమ పొట్టారని ఆరోపిస్తూ దుర్భాషలాడారు.

సమాన పనికి సమాన వేతనం చెల్లిం చాలని జీవో ఉన్నప్పటికీ తెలంగాణ యూనివర్సిటీలో అమలు చేయకుండా సాంబయ్య తమ కు అన్యాయం చేశారని సిబ్బంది ఆగ్రహం వ్య క్తం చేశారు.  దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త వా తావరణం ఏర్పడింది.  సమాచారం అందుకు న్న డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నవీన్‌కు మార్‌ క్యాంపస్‌ కు చేరుకుని అవుట్‌ సోర్సింగ్‌ సి బ్బందిని సముదాయించి శాంతింపజేశారు. సాంబయ్యను అక్కడి నుంచి వాహనంలో  పం పించి వేశారు. నియంత అధికారి వర్సిటీని వది లి వెళుతున్నారని పేర్కొంటూ అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top