షర్మిలకు పొంగులేటి అభినందనలు | ponguleti srinivas reddy congratulates ys sharmila | Sakshi
Sakshi News home page

షర్మిలకు పొంగులేటి అభినందనలు

Jan 8 2016 3:34 PM | Updated on Aug 21 2018 5:36 PM

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అండగా ఉంటారని వైఎస్ఆర్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

గాంధారి పోతంగల్ కలాన్(నిజామాబాద్ జిల్లా)‌: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అండగా ఉంటారని వైఎస్ఆర్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మహానేత మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన ప్రతివ్యక్తి కుటుంబానికి వైఎస్ జగన్ కుటుంబం అండగా ఉంటుందని చెప్పారు.

విజయవంతంగా పరామర్శయాత్ర పూర్తి చేసిన వైఎస్ షర్మిలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రతికూల పరిస్థితులను కూడా లెక్కచేయకుండా ప్రతి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారని తెలిపారు. పావురాలగుట్టలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని పొంగులేటి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement