వైఎస్ షర్మిల రెండో రోజు పరామర్శ యాత్ర ప్రారంభం | sharmila tour second day in nizamabad | Sakshi
Sakshi News home page

వైఎస్ షర్మిల రెండో రోజు పరామర్శ యాత్ర ప్రారంభం

Jan 8 2016 10:34 AM | Updated on Oct 17 2018 6:14 PM

నిజామాబాద్ జిల్లాలో వైఎస్ షర్మిల రెండో రోజు పరామర్శయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమెకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో వర్ణిమండలం రుద్రూరులో ఆమె వైఎస్ఆర్ సీపీ జెండాను ఆవిష్కరించారు

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో వైఎస్ షర్మిల రెండో రోజు పరామర్శయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమెకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో వర్ణిమండలం రుద్రూరులో ఆమె వైఎస్ఆర్ సీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కోటగిరి మండలం పాతపొట్టంగల్లో వీరయ్య కుటుంబాన్ని పరామర్శించారు.

రెండో విడత పరామర్శయాత్రలో భాగంగా గురువారం నిజామాబాద్ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలిరోజు పరామర్శ యాత్రలో భాగంగా పిట్లం మండలం చిల్లర్గిలో భట్టు చిన్నబాలయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అనంతరం జుక్కల్ మండలకేంద్రంలో నేదరి శిఖామణి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. రాజన్నపాలనను తిరిగి తెచ్చుకోవాలని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంది ఒక్క వైఎస్సారేనని షర్మిల గుర్తు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement