'సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్ది' | ys sharmila speech in paramarshayatra of warangal | Sakshi
Sakshi News home page

'సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్ది'

Sep 9 2015 6:37 PM | Updated on May 29 2018 6:04 PM

అన్ని వర్గాల ప్రజల సమస్యలను తీర్చేందుకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కే దక్కుతుందని వైఎస్ షర్మిల తెలిపారు.

వరంగల్: అన్ని వర్గాల ప్రజల సమస్యలను తీర్చేందుకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కే దక్కుతుందని వైఎస్ షర్మిల తెలిపారు. వరంగల్ జిల్లా రెండో విడత పరామర్శయాత్రలో భాగంగా మూడో రోజు నర్సంపేటలో ఏర్పాటు చేసిన సభలో షర్మిల ప్రసంగించారు.

 

తెలంగాణ ప్రజలు వైఎస్ ను గుండెల్లో పెట్టుకుని పూజించారని తెలిపారు. వైఎస్ మరణం తట్టుకోలేక ఎన్నో గుండెలు ఆగిపోయామన్నారు. రాజన్న రాజ్యం తెచ్చుకోవడానికి చేయి చేయి కలపాలంటూ షర్మిల పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement