ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకే..

ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకే.. - Sakshi


విజయవాడ:ఓటుకు కోట్లు కేసు నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయటపడేందుకు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టుపెట్టారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.  చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై స్పందించిన వైఎస్ జగన్.. ఏపీకి ప్రత్యేక హోదా లేదని చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటన్నారు.  చంద్రబాబు నాడు చెప్పిందేమిటి?.. ఇప్పుడు చేసేదేమిటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజలను బాబు మోసం చేస్తున్నారన్నారు. ఏపీ ప్రత్యేక హోదా కోరుతూ ఆత్మహత్యాయత్నం చేసిన సుబ్బారావును ఆస్పత్రిలో వైఎస్ జగన్ పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ-బీజేపీలు మోసం చేస్తున్నాయన్నారు. ఓటుకు కోట్లు కేసు గురించి కేంద్రంతో మాట్లాడుకోవటం వల్లే చంద్రబాబు మౌనం దాల్చుతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్రం వెనక్కి తగ్గినా..  చంద్రబాబు మిన్నుకుండిపోవడానికి కారణం ఓటుకు కోట్లు కేసేనన్నారు.


 


ఈరోజు కేంద్ర ప్రభుత్వ పెద్దలను బాబు కలిసినా..  ప్రత్యేక హోదాపై వారు కానీ, బాబు కానీ మాట్లాడటకపోవటాన్ని వైఎస్ జగన్ తప్పుబట్టారు. ప్రత్యేక హోదాపై ప్రధానితో చంద్రబాబు ఏమీ మాట్లాడలేదనేది అందరికీ అర్ధమైందన్నారు ఏపీ ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర ప్రజల హక్కని, దానిని సాధించుకోవడానికి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.


 


వైఎస్ జగన్ మాట్లాడుతూ..


*ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో మోసపోయిన ప్రతీ నిరుద్యోగి ఇప్పుడు ఆక్రందనలు వినిపిస్తున్నారు

*చంద్రబాబు పరిపాలన అంతా మోసం

*ప్రత్యేక హోదా సాధించే విషయంలో కూడా చంద్రబాబు మోసం చేస్తున్నారు

*మేమొస్తే ఐదేళ్లు కాదు.. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ పెద్దలు చెప్పారు

*ఆరోజు ఇచ్చిన మాటలు. ఇవాళ ఎందుకు అమలు చేయడం లేదు

*చంద్రబాబు తన మంత్రులను ఎందుకు కేంద్రం నుంచి ఉపసంహరించుకోవడం లేదు

*ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం లేదు

*చట్టంలో ఉన్నవాటిని అమలు చేస్తామని మాత్రమే చెప్తున్నారు

*ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పెట్టకుండా రాష్ట్ర విభజన ఓటేసింది మీరు కాదా?

*రాష్ట్ర విభజనకు వెంటనే ఓటేసే బదులు, నాలుగు రోజులు ఆలస్యం చేసి ఉండొచ్చు కదా?

*ఆ రోజు రాష్ట్ర విభజనకు ఓటేసిన వాళ్లు.. ఇవాళ బాధ్యత ఎందుకు తీసుకోవడం లేదు?

*ప్రధానమంత్రి అనే వ్యక్తి పార్లమెంటు సాక్షిగా చేసిన హామీకి బీజేపీ-టీడీపీలు కూడా ఆ రోజు మద్దతు పలికాయి

*అలాంటి హామీకి ఇవాళ దిక్కూ దివానం లేకుండా పోయింది, ఇక ప్రజలంతా ఏం కావాలి?

*ప్రత్యేక హోదా ఇవ్వరని చెప్పినప్పుడు చంద్రబాబు ఎందుకు మద్దతు కొనసాగిస్తున్నారు?

*ఈనెల 29న జరిపే బంద్ ను అడ్డుకునే ప్రయత్నం చేస్తే చంద్రబాబు చరిత్ర హీనుడు అవుతారు

*బంద్ ను చూపించి.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలను చంద్రబాబు చేయాలి

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top