దీక్ష కొనసాగిస్తే ఆరోగ్యం విషమిస్తుంది | ys jagan health condition poor | Sakshi
Sakshi News home page

దీక్ష కొనసాగిస్తే ఆరోగ్యం విషమిస్తుంది

Oct 11 2015 11:12 AM | Updated on Mar 23 2019 9:10 PM

దీక్ష కొనసాగిస్తే ఆరోగ్యం విషమిస్తుంది - Sakshi

దీక్ష కొనసాగిస్తే ఆరోగ్యం విషమిస్తుంది

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం మరింత క్షీణిస్తోందని వైద్యులు తెలిపారు

గుంటూరు: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం మరింత క్షీణిస్తోందని వైద్యులు తెలిపారు. వైఎస్ జగన్ దీక్ష ఐదో రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం వైఎస్ జగన్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మరోసారి 11 గంటల సమయంలో  పరీక్షలు చేశారు.

ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వైఎస్ జగన్ కేజిన్నర బరువు తగ్గి బాగా నీరసించిపోయారన్నారు. షుగర్ లెవల్స్ మరింత పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీక్ష కొనసాగిస్తే ఆరోగ్యం విషమించే ప్రమాదం ఉందని చెప్పారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తున్న నేపథ్యంలో ఇక నుంచి ప్రతి నాలుగు గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు వైద్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement