లారీ కిందకు తోసేసిన ప్రేమోన్మాది అరెస్ట్ | Youth arrested for throws woman under lorry | Sakshi
Sakshi News home page

లారీ కిందకు తోసేసిన ప్రేమోన్మాది అరెస్ట్

Sep 5 2015 7:53 PM | Updated on Aug 20 2018 4:27 PM

తన ప్రేమను నిరాకరించిందని యువతిని లారీ కిందకు తోసేసిన ప్రేమోన్మాదిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

ఇల్లెందు (ఖమ్మం): తన ప్రేమను నిరాకరించిందని యువతిని లారీ కిందకు తోసేసిన ప్రేమోన్మాదిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా ఇల్లెందులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి సంధ్యను శేఖర్ అనే యువకుడు లారీ కిందకు నెట్టడంతో ఆమె గాయాల పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టగా... శనివారం తెల్లవారుజామున అతడు పట్టుబడ్డాడు.

అరెస్ట్ వివరాలను డీఎస్పీ ఆర్.వీరేశ్వర్ మీడియాకు తెలిపారు. ఇలాంటి ఘాతుకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కాగా తనను ప్రేమించలేదనే సంధ్యను లారీ కిందకు నెట్టినట్టు నిందితుడు శేఖర్ తెలిపాడు. తీవ్రంగా గాయపడిన సంధ్య .. ప్రస్తుతం ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement