యువకుడి బలవన్మరణం | youngman suicide | Sakshi
Sakshi News home page

యువకుడి బలవన్మరణం

Mar 29 2017 10:49 PM | Updated on Sep 5 2017 7:25 AM

రోళ్లపాడు ఏకేఆర్‌ క్యాంపులో అసిస్టెంట్‌ మెకానిక్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ యువకుడు బుధవారం.. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

- వివాహం ఇష్టం లేక ఆత్మహత్య
- రోళ్లపాడులో ఘటన
 
మిడుతూరు: రోళ్లపాడు ఏకేఆర్‌ క్యాంపులో అసిస్టెంట్‌ మెకానిక్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ యువకుడు బుధవారం.. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ సుబ్రమణ్యం తెలిపిన వివరాల మేరకు.. పాములపాడు మండలం బానుముక్కల గ్రామానికి చెందిన దూదేకుల బాలస్వామి(22) రోళ్లపాడు ఏకేఆర్‌క్యాంపులో అసిస్టెంట్‌ మెకానిక్‌గా  పద్దెనిమిది నెలల నుంచి పనిచేస్తున్నాడు. ఐదు నెలల క్రితం అక్క కుమార్తె రమిజాబీతో  వివాహమైంది.  పెళ్లి ఇష్టం లేదని లేఖ రాసి రాత్రి సమయంలో నాల్గో షెడ్‌లో తన చొక్కాతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ తెలిపారు. నందికొట్కూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టర్‌ నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించామన్నారు. మృతుడి అన్న పెద్ద మౌలాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement